Asianet News TeluguAsianet News Telugu

90 ఏళ్ల వృద్ధురాలిపై 40 ఏళ్ల వ్యక్తి రేప్.. బైక్ పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అఘాయిత్యం

మధ్యప్రదేశ్‌లో 92 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. లిఫ్ట్ ఇస్తానని నమ్మించి 42 ఏళ్ల వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రోడ్డు పై వదిలేసి పారిపోయాడు. 
 

92 year old woman raped in madhya pradesh
Author
First Published Jan 15, 2023, 6:54 PM IST

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. 92 ఏళ్ల మహిళను 50 ఏళ్లు చిన్నవాడైన 42 ఏళ్ల దుండగుడు రేప్ చేశాడు. బైక్ పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన షాదోల్ జిల్లాలో శనివారం జరిగింది. ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. ఆస్పత్రి బెడ్ పై నుంచే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును చేజ్ చేశారు. నిందితుడిని భగవంత కోల్‌గా గుర్తించారు. శనివారం సాయంత్రం కోల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

జనవరి 12వ తేదీన రాత్రి పూట షాదోల్ స్టేషన్‌కు ట్రైన్‌లో ఆ వృద్ధురాలు వచ్చింది. సమీపంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లడానికి ఆమె తెల్లవారే వరకు వెయిట్ చేసింది. ఆ తర్వాతి రోజు ఉదయం ఆమె ఓ ఆటో రిక్షాలో బయల్దేరింది. కానీ, ఆ ఆటోరిక్షా ఆమెను మధ్యలోనే అంటే.. గమ్యానికి కొద్ది దూరంలో వదిలిపెట్టి వెళ్లిపోయింది. అక్కడి నుంచి బంధువుల ఇంటికి వెళ్లడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నది. అదే సమయంలో అటువైపుగా బైక్ పై భగవంత కోల్ వచ్చాడు.

Also Read: లవర్‌తో సీక్రెట్ ప్లేస్‌కు వెళ్లిన యువతిపై బాయ్‌ఫ్రెండ్ ముందే గ్యాంగ్ రేప్.. ఐదుగురు నిందితులు అరెస్టు

తన బైక్ పై ఆమెను ఆ గ్రామానికి తీసుకెళ్లుతా అని నమ్మించాడు. ఆమె కూడా అతడిని అనుమానించడానికి కారణాలేవీ కనిపించలేదు. ఆయన బైక్ పై వెళ్లడానికి ఆమె అంగీకరించింది. కొంత దూరం సరైన మార్గంలోనే వివరించాడు. కానీ, ఆ తర్వాత తన బైక్‌ను అడవి వైపు మళ్లించాడు. కొంత దూరం వెళ్లిపోయాక రేప్ చేశాడు. అనంతరం ఆమెను మెయిన్ రోడ్ పైకి తీసుకెళ్లి వదిలిపెట్టి వెళ్లిపోయాడు. రక్తస్రావం, ఇతర గాయాలతో ఆమె బాధపడుతూ అక్కడే ఉండిపోయింది.

అటు వైపుగా వచ్చిన ఓ బాటసారి సహాయంతో ఫోన్ ద్వారా తమ బంధువులను కాంటాక్ట్ చేసింది. వారు వెంటనే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడి నుంచే ఆమె పోలీసులకు విషయం చెప్పింది.

కానీ, ఈ కేసులో ఎలాంటి క్లూ లేదు. పూర్తిగా బ్లైండ్ కేసు. అయినప్పటికీ షాదోల్ ఎస్పీ పోలీసు బృందాలను ఏర్పాటు చేశాడు. టెక్నికల్ ఇన్‌పుట్లు, సైబర్ సెల్, సీసీటీవీ ఫుటేజీల సహాయంతో నిందితుడిని పోలీసులు ట్రేస్ చేశారు. సుమారు అరడజను గ్రామాలను జల్లెడ పట్టిన తర్వాత అంతారా గ్రామంలో భగవంత కోల్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఆ నేరాన్ని కోల్ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios