రేప్ చేసి బాలికను మురుగు కాల్వలో పడేశారు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 24, Aug 2018, 11:46 AM IST
9-year-old raped, dumped in ditch near Vasant Kunj in Delhi
Highlights

ఎన్ని చట్టాలు వచ్చినా చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు...అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడుతూ ప్రాణాలు తీసేస్తున్నారు కామాంధులు. తాజాగా తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత మురుగు కాల్వలో పడేసి వెళ్లిపోయిన దుర్ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది

న్యూ ఢిల్లీ: ఎన్ని చట్టాలు వచ్చినా చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు...అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడుతూ ప్రాణాలు తీసేస్తున్నారు కామాంధులు. తాజాగా తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత మురుగు కాల్వలో పడేసి వెళ్లిపోయిన దుర్ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది.  

రంగాపూర్ పహాడి సమీపంలోని వసంత కుంజ్ అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి తొమ్మిదేళ్ల చిన్నారి బహిర్భూమికి వచ్చింది. ఆ చిన్నారిని గుర్తు తెలియని దుండగులు రేప్ చేసి మరుగుకాల్వలో పడేసి పరారయ్యారు. కాలువ దగ్గర అపస్మారకస్థితిలో ఉన్న చిన్నారిని చూసిన కొందరు మహిళలు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 

చిన్నారిని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ట్రోమా కేర్ విభాగంలో చికిత్స పొందుతుంది. చిన్నారిపై భౌతిక దాడికి పాల్పడటంతో ఆమెకు శస్త్ర చికిత్స చేశారు.  

 అత్యాచారా ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సౌత్ వెస్ట్ డీసీపీ దేవేందర్ ఆర్యా తెలిపారు. డ్రగ్స్ కు బానిసలైన కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

చిన్నారి తండ్రి డ్రైవర్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్నిపోషిస్తున్నాడు. దాంతోపాటు భార్య సిగరెట్ దుకాణం నిర్వహిస్తోంది. దంపతులకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు. దుండగుల చేతిలో తన కుమార్తె అత్యాచారానికి గురయ్యిందని తెలియడంతో కుప్పకూలిపోయాడు. బాలిక దగ్గరలోని ప్రభుత్వపాఠశాలలో నాలుగో తరగతి చదువుతుంది. కోచింగ్ సెంటర్ నుంచి బాలిక ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి మరుగ కాల్వలో రక్తపుమడుగులో పడి ఉండటంతో తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా...అక్కడి వైద్యులు ఎయిమ్స్ కు రిఫర్ చేశారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. 

కాలనీలో ఇంటింటికి మరుగుదొడ్లు లేకపోవడంతో అటవీ సరిహద్దు ప్రాంతంలో కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించారని స్థానికులు చెప్తున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతంలో టాయిలెట్స్ నిర్మించడంతో మరుగుకు వెళ్లే మహిళలు ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి వెళ్తారని తెలిపారు.  చిన్నారి ఒంటరిగా వెళ్లిందని...తోడు ఎవ్వరూ లేకపోవడంతో అత్యాచారానికి గురైందని చెప్తున్నారు. 

కామాంధులు బాలికను తీవ్రంగా గాయపరిచారని అందువల్లే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు మహిళలు చెప్తున్నారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో చనిపోయిందని భావించిన నిందితుడు మరుగుకాల్వ పక్కన పడేసి వెళ్లిపోయాడంటున్నారు. చిన్నారి బుగ్గలపైనా చేతులపైనా గాయాలయ్యాయని తెలిపారు. రేప్ జరిగిన పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలు లేకపోవడంతో గమనార్హం. అయితే కొందరు వ్యక్తులు మాస్క్ ధరించి కాలనీలో తిరిగారని చిన్నారి తల్లి చెప్తోంది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  బాలిక కోలుకున్న తర్వాత స్టేట్మెంట్ తీసుకుని సెక్షన్ 164 సీఆర్పీసీ కింద నిందితుల ఊహాచిత్రాలు విడుదల చేస్తామని తెలిపారు. కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో ఈ ఏడాది నలుగురి చిన్నారులు అత్యాచారానికి గురికాగా ఇది అయిదో ఘటన కావడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తల్లి పక్కలో పడుకున్న బాలికను ఎత్తుకెళ్లి రేప్ చేశాడు

‘‘మార్కులు కావాలంటే.. నా కోరిక తీర్చాలి’’
మాందాసర్ రేప్: ఇద్దరు నిందితులకు ఉరి, 2 నెలల్లో తీర్పు

loader