న్యూఢిల్లీ:   పొట్టకూటి కోసం  వేశ్య వృత్తిని నమ్ముకొన్న ముగ్గురిపై 9 మంది  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం నాడు  చోటు చేసుకొంది. ఈ విషయమై బాధితురాలు బుధవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 న్యూఢిల్లీని  లజ్‌పత్‌నగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో  మంగళవారం రాత్రి  ముగ్గురు వేశ్యలు వేచి ఉన్నారు.  విటుల కోసం వేచి ఉన్నారు. అయితే ఆ సమయంలో స్విఫ్ట్ డిజైర్  కారులో  ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున ఒప్పందం కుదుర్చుకొన్నారు.

అంతేకాదు రూ.3600 అడ్వాన్స్‌గా ఇచ్చారు.  నోయిడా సెక్టార్‌ 135 లో ఓ ఫామ్‌హౌజ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ మరో ఏడుగురు వ్యక్తులు వచ్చారు. తొలుత ముగ్గురు వ్యక్తులేనని  భావించారు. ఏడుగురు వ్యక్తులను చూసిన వేశ్యలు ఒప్పుకోలేదు.  అయితే 9 మంది వ్యక్తులు ఆ ముగ్గురు వేశ్యలపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతేకాదు బాధితులపై భౌతికంగా దాడికి పాల్పడ్డారు.  9 మంది  వారిపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ బాధను భరించలేక ఓ యువతి బతిమిలాడితే ఈ ముగ్గురిని బుధవారం నాడు తెల్లవారుజామున మెయిన్ రోడ్డులో వదిలిపెట్టారు. 

 నిందితులు రోడ్డుపై వదిలి వేయగానే బాధితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసుత నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తునన్ారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఏడుగురిని అదుపులోకి తీసుకొన్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.