పాక్ బుద్ధి వంకరే: కాల్పుల్లో 8 ఏళ్ల బేబీ సహా 9 మంది మృతి

8-Month-Old Baby Among Nine Killed Pak Shelling In A Week In Jammu
Highlights

పాకిస్తాన్ బుద్ధి ఏ మాత్రం మారడం లేదు. గత వారంలో పాకిస్తాన్ సైనికులు సెటిల్మెంట్లను, బోర్డర్ ఔట్ పోస్టులను లక్ష్యం చేసుకుని కాల్పులు జరిపారు.

జమ్మూ: పాకిస్తాన్ బుద్ధి ఏ మాత్రం మారడం లేదు. గత వారంలో పాకిస్తాన్ సైనికులు సెటిల్మెంట్లను, బోర్డర్ ఔట్ పోస్టులను లక్ష్యం చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ పసిపాపతో పాటు 9 మంది మరణించారు. 

మృతుల్లో ఇద్దరు సైనికులు కూడా ఉన్నారు. దాదాపు 50 మంది పౌరులు గాయపడ్డారు. జమ్ము, సాంబా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపారు. వరుసగా ఎనిమిదో రోజు కాల్పులకు తెగబడ్డారు భారత బలగాలు వారిని తిప్పికొట్టాయి. 

వందలాది గ్రామస్థులు తమ ఇళ్లను ఖాళీ చేసి బంధువుల ఇళ్లలోకి లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లోకి వెళ్లారు. విద్యాసంస్థలను అన్నింటినీ మూసేశారు 

పాకిస్తాన్ రేంజర్స్ భారీ, విచక్షణారహితంగా మోర్టార్ బాంబులను ప్రయోగించారని, రాత్రి పూట కాల్పులు జరిపారని, రామగఢ్, సాంబ సెక్టార్లలోని గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని పోలీసులు చెబుతున్నారు. 

loader