దారుణం: మత్తిచ్చి మైనర్ బాలికపై 21 మంది గ్యాంగ్ రేప్

7 accused of raping minor girl
Highlights

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్


చెన్నై: మైనర్ బాలికకు గంజాయి, మద్యం, డ్రగ్స్ అలవాటు చేసి 21 మంది సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. అయితే ఆ బాలిక ప్రియుడే ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి. ఈ ఘటనకు పాల్పడినవారిలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరులో కూలీ పనులు చేసుకొంటూ  ఓ కుటుంబం జీవనం సాగిస్తోంది. అయితే వారికి ఓ కూతురు ఉంది. ఆమె అక్కడి స్కూల్లోనే పదో తరగతి చదువుతోంది.  అయితే  ఆ బాలిక ఈ ఏడాది జూన్ 5 వ తేదిన అదృశ్యమైంది.


అయితే ఆ బాలికకు స్నేహితుడుగా ఉన్న ఓ యువకుడు ఆమెను మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేశారు.  ఆమెను ఓ గదిలో బంధించి ప్రియుడు సహా సుమారు 21 మంది గ్యాంగ్‌రేప్ కు పాల్పడ్డారు. బాధితురాలికి గంజాయి, డ్రగ్స్, మద్యం అలవాటు చేశారు. ఆమె మత్తులోకి చేరుకొన్న తర్వాత  ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమెను నిందితులు వదిలిపెట్టారు. అయితే జూన్ 9వ తేదిన మత్తులో ఉన్న బాలిక బస్టాండ్ వద్ద కన్పించిందని పోలీసులు తెలిపారు. ఆమెను విచారిస్తే తనపై 21 మంది కిడ్నాప్ చేసి రేప్ చేశారని చెప్పారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఆమెతో పాటు చదువుకొనే విద్యార్ధులే ఎక్కువగా ఉన్నారు. 

వీరిలో  తిరువళ్లూర్‌కు చెందిన రాజేష్‌, మహేష్‌, తలకంచేరికి చెందిన కుమార్‌, కార్తిక్‌, అరుణ్‌కుమార్‌, కాకులూరుకు చెందిన కమల్‌ అలియాస్‌ రాజ్‌కమల్‌ లను పోలీసులు సోమవారం సాయంత్రం తిరువళ్లూర్‌ మహిళా న్యాయస్థానంలో హాజరుపరిచి న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు పుళల్‌ జైలుకు తరలించారు. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

loader