కరోనా కారణంగా దేశం మొత్తం అష్టకష్టాలు పడుతుంటే కొందరు కామాంధులు మాత్రం ఈ సమయంలోనూ రెచ్చిపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ చిన్నారి కళ్లను పొడిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. దామోహ్‌లో బుధవారం సాయంత్రం ఓ ఆరేళ్ల చిన్నారి తన స్నేహితులతో ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఆమెను గుర్తించిన ఓ దుండగుడు ఆ చిన్నారిని పక్కకు లాక్కెళ్లాడు.

Also Read:=78 జిల్లాల్లో 14 రోజులుగా కరోనా కేసులు లేవు, లాక్ డౌన్ ఆంక్షలు వీటికి లేవు: కేంద్రం

అనంతరం పాపపై అత్యాచారానికి పాల్పడి, చిన్నారి కళ్లను పదునైన వస్తువులతో పొడిచాడు. దీంతో బాలిక స్పృహ తప్పి కిందకు పడిపోగా.. గుడ్లు బయటకు వచ్చాయి. పాప ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన ఆమె కుటుంబసభ్యులు గ్రామం మొత్తం గాలించారు.

ఎట్టకేలకు గురువారం ఉదయం చిన్నారి ఆచూకీ లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప పరిస్ధితి విషమంగా వుందని, చిన్నారి శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: జార్ఖండ్‌లో కుటుంబం బహిష్కరణ, విచారణకు ఆదేశం

ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించడంతో పోలీసులను కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అనుమానితులను విచారిస్తున్నామని, ఆధారాలు సేకరిస్తున్నామని ఉన్నతాధికారులు  తెలిపారు.