న్యూఢిల్లీ:  ఆరేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటన పూల్‌భేహడ్ బ్లాక్ లోని ఓ గ్రామంలో చోటు చేసుకొంది. ఈ గ్రామం లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాలో ఉంది.ఇద్దరు మైనర్ సోదరులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఒకటో తరగతి చదువుతున్న మృతురాలు మంగళవారం మధ్యాహ్నం నుండి కన్పించకుండా పోయింది. నిందితుల ఇంటి వద్దనే ఆడుకొంటూ చివరిసారిగా కన్పించిందని స్థానికులు చెప్పారు.

గ్రామంలో ఎక్కడా వెతికినా కూడ ఆ బాలిక ఆచూకీ లభ్యం కాలేదు.దీంతో కుటుంబసభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి మొత్తం పోలీసులు గ్రామస్తుల సహకారంతో వెతికారు.

బుధవారం నాడు తెల్లవారుజామున మూడు గంటలకు బాలిక మృతదేహం దొరికింది.నిందితుల తల్లి ఈ విషయాన్ని ఒప్పుకొంది. బాలిక మృతదేహన్నిపూడ్చేందుకు తాను సహకరించినట్టుగా ఆమె పోలీసుల ముందు అంగీకరించింది.

బాలికను హత్య చేసిన ఇద్దరు కూడ మైనర్లే. వీరిద్దరి వయస్సు ఒకరిది 15 ఏళ్లు, మరోకరిది 12 ఏళ్లు.అర్ధాంతరంగా స్కూల్ మానేసి పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.ఇద్దరు బాలురితో పాటు ఆమె తల్లిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల ఇంటి వద్దే చివరిసారిగా బాలిక కన్పించడంతో  మృతురాలి తల్లి వారిపైనే అనుమానం వ్యక్తం చేసింది. నిందితుల ఇంటికి 200 మీటర్ల దూరంలో బాలిక మృతదేహం లభ్యమైంది.