మహిళలు, చిన్నారులు, వృద్ధులు అన్న తేడా లేకుండా తమ కామవాంఛను తీర్చుకుంటున్న కామాంధులు చివరికి మరణించిన వారిని కూడా వదలడం లేదు. చనిపోయి శ్మశానంలో పూడ్చిబడిన ఓ బాలిక శవాన్ని వెలికి తీసి అత్యాచారానికి ప్రయత్నించాడో వ్యక్తి.

వివరాల్లోకి వెళితే... అస్సాంకు చెందిన 14 ఏళ్ల బాలిక మే 17న గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అదే రోజు రాత్రి ఆమె కుటుంబసభ్యులు బాలికను ఊరికి దగ్గరలోని సైమన్ నదీ తీరంలో మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు గ్రామస్తులు కూడా హాజరయ్యారు.

Also Read:మైనర్ బాలుడిపై యువతి అత్యాచారం.. బిడ్డ పుట్టాక..

అయితే ఆ తర్వాతి రోజు 51 ఏళ్ల అకాన్ సైకియా అనే వ్యక్తి బాలికను పూడ్చిపెట్టిన ప్రదేశానికి వెళ్లి శవాన్ని బయటికి తీసి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీనిని అటుగా వెళ్తున్న ఓ జాలరి చూసి ఆశ్చర్యానికి గురై పోలీసులకు  సమాచారం అందించాడు.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అకాన్‌ను అదుపులోకి తీసుకున్నారు,. బాలిక శవాన్ని పరీక్షించేందుకు గాను కుటుంబసభ్యుల అనుమతితో మరోసారి పోస్ట్‌మార్టంకు తరలించి, నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

నిందితుడిపై ఫోక్సో చట్టంతో పాటు ఐపీసీ 306, 377 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ  వెల్లడించారు. కాగా అకాన్ సైకియాకు నేర చరిత్ర ఉంది. ఇప్పటికే అతనికి రెండు సార్లు పెళ్లిళ్లయ్యాయి.

Also Read:ఆలయంలో మహిళలపై అత్యాచారం, పూజారి అరెస్ట్

2018లో మొదటి భార్య గృహహింస కింద అకాన్‌పై కేసు పెట్టడంతో దేమాజీ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. కోవిడ్ 19 నేపథ్యంలో జైళ్లో ఉంటే ఖైదీలకు కరోనా సోకే అవకాశం వుందని సుప్రీంకోర్టు పలువురు ఖైదీలకు పెరోల్ మంజూరు చేసింది.

ఈ క్రమంలో మార్చి నెలాఖరులో అఖాన్‌కు పెరోల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. బయటికి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇలాంటి దురాగతానికి పాల్పడటంతో అతని మానసిక స్థితిని ఆరా తీస్తున్నారు. అయితే అకాన్ తొలి నుంచి మహిళల పట్ల సైకోగా వ్యవహరించేవాడని స్థానికులు చెబుతున్నారు. 

కొందరు మాత్రం మరణించిన బాలికపై అకాన్ లైంగిక వేధింపులకు పాల్పడటం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.