ఉత్తర ప్రదేశ్ లో మరోసారి కామాంధులు రెచ్చిపోయారు. పెళ్లి వేడుకలకు వెళ్ళి ఇంటికి  తిరిగొస్తున్న ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ రాక్షసానందం పొందారు. ఈ అఘాయిత్యం గత ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఈ ఘటనకు సబంధించిన వివరాలిలా ఉన్నాయి. బులంద్ షహర్ కు చెందిన ఓ 15ఏళ్ల బాలిక తన సోదరుడితో కలిసి పెళ్లి వేడుకలను వెళ్లింది. అనంతరం బైక్ పై  వీరిద్దరు ఇంటికి తిరిగి వస్తుండగా కారులో వెళుతున్న నలుగురు యువకులు వీరిని వెంబడించారు. వెనుకనుండి వచ్చి బైక్ ను ఢీకొట్టడంతో యువతితో పాటు ఆమొ సోదరుడు కిందపడిపోయారు. 

అనంతరం కారులోని యువకులు యువతి సోదరున్ని చితకబాదారు. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేని  రోడ్డుపక్కనే వున్న పొలంలో పడేశారు. బాలికను మాత్రం తమతో పాటు కారులో తీసుుకెళ్లి కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఎలాగోలా  కట్లను విడిపించుకున్న యువతి సోదరుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారంతా కలిసి యువతి జాడ కోసం వెతకగా సంఘటనాస్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలో తీవ్ర గాయాలతో కనిపించింది. దీంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. 

కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు...కాస్త కోలుకోగానే ఈ అఘాయిత్యానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తామని పోలీసులు తెలిపారు.