భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఐదేళ్ల బాలికను నిర్బంధించి, ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత నగరంలోని నదిలో పడేశారు. 

ఆమె నగ్నదేహం శిప్రా నదిలో తేలిందని పోలీసులు శనివారం చెప్పారు. శుక్రవారంనాడు ఆ బాలిత తప్పిపోయింది. ఆ విషయంపై కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఆమె శవం నదిలో తేలిందని, ఆమె శరీరంపై గాయాలున్నాయని, దాన్ని బట్టి ఆమెపై అత్యాచారం చేసి చంపి ఉంటారని పోలీసులు అన్నారు.  

ఆ సంఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో బాలిక అంకుల్ కూడా ఉన్నాడు.