మహిళలకు రక్షణగా పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ లో ఓ ఎన్జీవో సంస్థలో పనిచేస్తున్న ఐదుగురు మహిళలను మారణాయుధాలతో బెదిరించి దాదాపు ఆరుగురు వ్యక్తులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళల అక్రమ రవాణాపై  గ్రామాల్లో అవగాహన కల్పించడానికి వెళ్లిన వీరిపై దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

వివరాల్లోకి వెళితే కుంతి జిల్లాలోని ఓ గ్రామాంలో మహిళల అక్రమ రవాణాపై గ్రామస్తులకు అవగాహన కల్పించడానికి ఓ ఎన్జీవో సంస్థ వీధి నాటకం ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనడానికి మొత్తం తొమ్మిదిమంది సభ్యులు గ్రామానికి వెళ్లారు. అయితే ఈ కార్యక్రమం జరుగుతున్న ప్రాంతానికి మారణాయుధాలతో ప్రవేశించిన దుండగులు నలుగురు పురుషుల్ని తీవ్రంగా కొట్టి వారి మూత్రాన్ని వారిచేతే తాగిచ్చినట్లు ఓ బాధితురాలు తెలిపింది. అనంతరం వారిని కారులో బంధించి లాక్ వేసి ఐదుగురు మహిళలను అడవిలోకి ఎత్తెకెళ్లారు.

 దాదాపు ఆరుగురు వ్యక్తులు తమ ఐదుగరిని మార్చి మార్చి గ్యాంగ్ రేప్ చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఇలా దాదాపై నాలుగు గంటల పాటు దారుణానికి పాల్నడినట్లు, ఈ మొత్తం దృశ్యాలను ఒకడు తన సెల్ ఫోన్ లో బంధించినట్లు తెలిపింది. వారు గన్ ను తలకు గురిపెట్టి దారుణంగా లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆవేధనతో తెలిపింది. 

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీస్ అధికారి ఓంకార్ తెలిపారు. బాధితులంతా మేజర్లేనని, వారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.  ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.