లైవ్: బెంగాల్లో దీదీ హ్యాట్రిక్, తమిళనాడు స్టాలిన్ దే, కేరళలో మళ్లీ ఎల్డీఎఫ్ | 5 state election results live updates ksp

లైవ్: బెంగాల్లో దీదీ హ్యాట్రిక్, తమిళనాడు స్టాలిన్ దే, కేరళలో మళ్లీ ఎల్డీఎఫ్

5 state election results live updates ksp

4:29 PM IST

సువేందుపై పైచేయి.. నందిగ్రామ్‌లో 1,200 ఓట్ల మెజార్టీతో దీదీ గెలుపు

తీవ్ర ఉత్కంఠను రేపిన నందిగ్రామ్‌‌లో టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన విజయం నమోదు చేశారు. చివరి రౌండ్ వరకు ట్వంటి 20 మ్యాచ్‌ను తలపించిన పోరులో తన మాజీ అనుచరుడు, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారిపై 1200 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 
 
4:21 PM IST

నందిగ్రామ్‌లో ఉత్కంఠ.. 820 ఓట్ల ఆధిక్యంలో దీదీ

నందిగ్రామ్‌ ఫలితం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి, సీఎం మమతా బెనర్జీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు నడుస్తోంది. చివరి రౌండ్‌లో సువేందుపై మమతా బెనర్జీ 820 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. మరికాసేపట్లో తుది ఫలితం తేలనుంది.

3:45 PM IST

నందిగ్రామ్‌లో ఉత్కంఠ... ఆరు ఓట్ల ఆధిక్యంలో సువేందు

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ప‌శ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ ఎన్నిక‌ల కౌంటింగ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. 17 రౌండ్ల కౌంటింగ్‌లో 16 రౌండ్లు ముగిసే స‌రికి ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీపై బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి కేవలం 6 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో చివ‌రి రౌండ్ కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.

3:35 PM IST

విజయానికి చేరువలో మమతా బెనర్జీ..?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠను కలిగించిన నందిగ్రామ్‌లో టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ విజయానికి చేరువైనట్లుగా తెలుస్తోంది. తన సమీప ప్రత్యర్ధి బీజేపీ నేత సువేందు అధికారిపై దీదీ 8 వేల ఓట్ల తేడాతో ఆధిక్యంలో వున్నారు. ఇక మిగిలింది ఒక్క రౌండ్ మాత్రమే. దీంతో నందిగ్రామ్‌లో విజేత ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. 
 
3:23 PM IST

నందిగ్రామ్‌లో ఉత్కంఠ.. 8 వేల ఓట్ల ఆధిక్యంలో మమత

నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాలు క్షణక్షణం ఆసక్తి కలిగిస్తున్నాయి. ఉదయం నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చిన బీజేపీ నేత సువేందు అధికారి ఒక్కసారిగా వెనుకబడిపోయారు. ప్రస్తుతం బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దాదాపు 8 వేల ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 
 
3:11 PM IST

మమతకు గాయం వల్లే, ఈ ఫలితం.. కైలాస్ విజయవర్గీయ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్న బీజేపీకి తాజా ఫలితాలు షాకిచ్చాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ 200కు పైగా సీట్లలో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండటం, దీదీ సైతం నందిగ్రామ్‌లో పుంజుకోవడం కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం, ప్రచార సభలకు జనం నుంచి భారీగా స్పందన రావడంతో తమ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు భావించారు. అయితే ఫలితాలు అందుకు విరుద్ధంగా రావడంతో వారికి మింగుడు పడటం లేదు. దీనిపై ఆ పార్టీ పార్టీ సీనియర్ నేత కైలాస్ విజయవర్గీయ స్పందించారు. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదన్నారు. మమతా బెనర్జీ కాలికి గాయం కావడం టీఎంసీకి ఎక్కువ సీట్లు వచ్చాయని విజయ వర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
3:01 PM IST

నటుడు సురేశ్ గోపీ పరాజయం

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. సినీనటుడు, బీజేపీ నేత సురేశ్ గోపీ త్రిసూర్‌లో ఓటమి పాలయ్యారు. అలాగే ముంజేశ్వర్ నుంచి బరిలోకి దిగిన కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ సైతం ఓడిపోయారు. 

2:48 PM IST

నందిగ్రామ్‌లో ఉత్కంఠ... మళ్లీ ఆధిక్యంలోకి మమత

నందిగ్రామ్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. తాజాగా పది రౌండ్లు ముగిసే సరికి 10 వేల ఆధిక్యంలో సువేందు అధికారి వున్నారు. అయితే ఆ కొద్దిసేపటికే దీదీ పుంజుకున్నారు. ప్రస్తుతం మమత 2,331 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 

2:42 PM IST

10 వేల ఓట్ల ఆధిక్యంలో సువేందు.. మమత శిబిరంలో టెన్షన్

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నందిగ్రామ్‌లో ఫలితం క్షణక్షణానికి ఉత్కంఠ కలిగిస్తోంది. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. తాజాగా పది రౌండ్లు ముగిసే సరికి 10 వేల ఆధిక్యంలో సువేందు అధికారి వున్నారు. ఈ నేపథ్యంలో మమత శిబిరంలో ఆందోళన నెలకొంది. 

2:23 PM IST

ఊమెన్ చాందీ విజయం

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పూతుపల్లి స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ఉమెన్ చాందీ గెలుపొందారు.

2:23 PM IST

మమత, స్టాలిన్‌లకు కేజ్రీవాల్ శుభాకాంక్షలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న టీఎంసీకీ, మమతా బెనర్జీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. దీదీ అద్బుతమైన పోరాటం చేశారని ఆయన కొనియాడారు. మరోవైపు తమిళనాడులో దాదాపు పదేళ్ల తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు కూడా కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. తమిళుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అద్భుతమైన పరిపాలన అందించాలని ఆయన ఆకాంక్షించారు.

2:11 PM IST

విజయోత్సవాలపై ఈసీ హెచ్చరికలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయోత్స ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కోవిడ్ విపత్కర పరిస్ధితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి విజయోత్స ర్యాలీలు నిర్వహిస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఇవి జరిగిన పోలీస్ స్టేషన్ ఎస్ఓహెచ్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సీఎస్‌లను ఈసీ ఆదేశించింది. 
 
2:05 PM IST

ఇది మోడీ, షాల ఓటమే: సంజయ్ రౌత్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో బీజేపీపై విరుచుకుపడ్డారు శివసేన ఫైర్ బ్రాండ్, ఎంపీ సంజయ్ రౌత్. బెంగాల్‌లో మమత విజయం సాధిస్తే ప్రధాని మోడీ, అమిత్‌ షాలు వ్యక్తిగతంగా ఓడినట్లేనని సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపీకి బెంగాల్‌ ఫలితాల తర్వాత ఆందోళన తప్పదని ఆయన జోస్యం చెప్పారు. కరోనాను నియంత్రించడంలో విఫలమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇక స్థిరంగా ఉండలేదని సంజయ్ వ్యాఖ్యానించారు.

2:01 PM IST

నందిగ్రామ్‌లో మళ్లీ సువేందు ముందంజ

నందిగ్రామ్‌లో ఆధిక్యం దోబుచులాడుతోంది. ఏడో రౌండ్‌లో మమతా బెనర్జీ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. అయితే ఆ తర్వాత సువేందు అధికారి తిరిగి పుంజకున్న సువేందు 9,900 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. అనంతరం మళ్లీ మమత 1,427 ఓట్ల తేడాతో లీడ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం మళ్లీ సువేందు 3,800 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
1:53 PM IST

దీదీకి అఖిలేశ్ అభినందనలు

ప‌శ్చిమ‌బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటంతో స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. మరోసారి సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్న టీఎంసీ అధినేత్రి మమ‌తాబెన‌ర్జికి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. దీదీ ఓ దీదీ అంటూ ప్ర‌ధాని మోడీ త‌న ఎన్నిక‌ల‌ ప్ర‌చార స‌భ‌ల్లో చేసిన వెక్కిరింత‌ల‌కు ఈ ఫ‌లితాలు గ‌ట్టి స‌మాధాన‌మ‌ని చెప్పాయని అఖిలేశ్ ఎద్దేవా చేశారు.

1:41 PM IST

కేరళలో ఈ విజయం ప్రజల ఆశీర్వాదం: ప్రకాశ్ కారత్

కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. గడిచిన 40 ఏళ్ల కాలంలో కేరళలో ఏ పార్టీ వరుసగా రెండోసారి విజయం సాధించలేదు. ఈ గెలుపుపై సీపీఎం నేత ప్రకాశం కారత్ స్పందించారు. పినరయి విజయన్ ప్రభుత్వ తీరును మెచ్చి ప్రజలు విజయాన్ని కట్టబెట్టారని ప్రశంసించారు. వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్ధితులతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కేరళ ప్రభుత్వం బాగా పనిచేసిందని ప్రకాశ్ కారత్ అన్నారు. 
 
1:26 PM IST

మమత నివాసం ముందు సంబరాలు

స్పష్టమైన ఆధిక్యంతో  పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇంటిముందు  టీఎంసీ కార్యకర్తలు  సంబరాలు చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు  చేస్తూ సందడి చేశారు

1:12 PM IST

నందిగ్రామ్‌లో దోబూచులాడుతున్న ఆధిక్యం

నందిగ్రామ్‌లో ఆధిక్యం దోబుచులాడుతోంది. కొద్దిసేపటి క్రితం ఏడో రౌండ్‌లో మమతా బెనర్జీ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. అయితే ఆ తర్వాత సువేందు అధికారి తిరిగి పుంజకున్నారు. 8వ రౌండ్‌లో సువేందు 9,900 ఓట్ల ఆధిక్యంలో వున్నారు.

1:03 PM IST

ముందంజలో సినీనటుడు సురేశ్ గోపీ

కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా త్రిసూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన సినీనటుడు సురేశ్ గోపీ ఆధిక్యంలో వున్నారు.

12:52 PM IST

నందిగ్రామ్‌లో లీడ్‌లోకి మమతా బెనర్జీ

నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ- బీజేపీ నేత సువేందు అధికారి మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు జరుగుతుంది. ఆధిక్యం ఇద్దరి మధ్యా దోబుచులాడుతోంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం మమతా బెనర్జీ లీడ్‌లోకి వచ్చారు. సువేందుపై ఆమె దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యంలో వున్నారు.

12:46 PM IST

అన్నాడీఎంకే- ఏఎంఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో అన్నాడీఎంకే, ఏఎంఎంకే మధ్య ఘర్షణ జరిగింది. అరుప్పుక్కోట్టై అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి వైగై సెల్వన్, సత్తూర్ కౌంటింగ్ హాల్ వద్దకు వచ్చారు. దీంతో అన్నాడీఎంకే, ఏఎంఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగిరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. 

12:34 PM IST

మాజీ సీఎంపై ఇండిపెండెంట్ అభ్యర్ధి ఆధిక్యం

పుదుచ్చేరి మాజీ సీఎం రంగస్వామి యానాంలో వెనుకంజలో వున్నారు. ఆయనపై ఇండిపెండెంట్ అభ్యర్ధి 674 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 

12:25 PM IST

ఓడితే బాధ్యత నాదే: బెంగాల్ బీజేపీ చీఫ్

ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటాన‌ని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌. అయితే ట్రెండ్స్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తేల్చ‌వ‌ని, మళ్లీ పుంజుకుని బీజేపీ అభ్యర్ధులు గెలుస్తారన్న నమ్మకం వుందని దిలీప్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
12:08 PM IST

200కు పైగా స్ధానాల్లో టీఎంసీ ఆధిక్యం

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో టీఎంసీ ఎదురులేకుండా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం తృణమూల్ కాంగ్రెస్ 206 చోట్ల ఆధిక్యంలో వుంది. 

12:08 PM IST

విజయానికి చేరువలో ఉదయనిధి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే దూసుకుపోతోంది. మేజిక్ ఫిగర్‌ను దాటి ఆ పార్టీ ముందంజలో వుంది. ఈ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉదయనిధి స్టాలిన్‌ విక్టరీకి దగ్గరగా ఉన్నాడు. చెపాక్‌-తిరువళ్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉదయనిధిస్టాలిన్‌ పోటీలోకి దిగారు.
 
12:03 PM IST

మళ్లీ లీడ్‌లోకి సువేందు అధికారి

నందిగ్రామ్‌లో పోరు నువ్వా నేనా అన్నట్లుగా వుంది. కొద్దిసేపటి క్రితం మమతా బెనర్జీ పుంజుకోగా.. మళ్లీ వెంటనే సువేందు అధికారి లీడింగ్‌లోకి వచ్చారు.

11:57 AM IST

పుదుచ్చేరిలో పదేళ్ల తర్వాత ఖాతా తెరిచిన బీజేపీ

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీకి ఊరట లభించింది. దాదాపు దశాబ్ధం తర్వాత అక్కడ బీజేపీ ఖాతా తెరిచింది. పుదుచ్చేరిలోని రెండు స్థానాల్లో కమల వికసించింది. 

11:40 AM IST

డీఎంకే శ్రేణుల సంబరాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులే ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టాయి. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న డీఎంకే నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

11:38 AM IST

పుంజుకున్న దీదీ.. అయినా లీడింగ్‌లో సువేందు

దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన నందిగ్రామ్ నియోజకవర్గంలో టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎట్టకేలకు పుంజుకున్నారు. అయినప్పటికీ బీజేపీ నేత సువేందు అధికారి 3,110 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 

11:31 AM IST

ఐదు రాష్ట్రాల్లో మూడు చోట్ల అధికార పార్టీలదే ఆధిక్యం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల అధికార పార్టీలు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. బెంగాల్లో‌ తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి, అసోంలో బీజేపీ వరుసగా రెండోసారి, కేరళలో ఎల్డీఎఫ్‌లు రెండోసారి అధికారంలోకి వచ్చాయి. 

11:20 AM IST

బెంగాల్‌లో ఆధిక్యంలో వున్న ప్రముఖులు

దమ్ దమ్ నార్త్‌లో చంద్రీమా భట్టాచార్య, మదన్ మిత్రా కమర్హతిలో బ్రాత్యా బసు దమ్ దమ్‌లో, సింగూర్‌లో బెచరం మన్నా, హబ్రాలో జ్యోతిప్రియో ముల్లిక్ అధిక్యంలో వున్నారు.

11:04 AM IST

ఆధిక్యంలో టీఎంసీ, వెనుకంజలో దీదీ

ప‌శ్చిమ బెంగాల్‌లో ఎన్నికల్లో వింత ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. అక్క‌డ తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ‌రుస‌గా మూడోసారి అధికారం చేపట్టే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే ఆధిక్యాల ప‌రంగా టీఎంసీ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసింది. అయితే పార్టీ చీఫ్ , ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం నందిగ్రామ్‌లో వెనుకంజ‌లో ఉండ‌టం శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. నాలుగు రౌండ్ల ఓట్లు లెక్కింపు పూర్త‌య్యేస‌రికి నందిగ్రామ్‌లో మ‌మ‌త‌పై 8106 ఓట్ల తేడాతో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి ఉన్నారు.

11:01 AM IST

200 ఓట్ల ఆధిక్యంలో పన్నీర్ సెల్వం

బోడినాయక్కనూర్‌లో తమిళనాడు డిప్యూటీ సీఎం, అన్నాడీఎంకే అగ్రనేత పన్నీర్ సెల్వం 200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

10:52 AM IST

ఆధిక్యంలోకి వచ్చిన ఉదయనిధి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చెపాక్‌లో బరిలోకి దిగిన డీఎంకే యువనేత, హీరో ఉదయ నిధి స్టాలిన్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు.

10:40 AM IST

వెనుకంజలో తమిళనాడు మంత్రులు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు జయకుమార్, రాజేంద్ర బాలాజీ, ఓఎస్ మణియన్, సీవీ షణ్ముగం వెనుకంజలో వున్నారు

10:27 AM IST

తమిళనాడులో మేజిక్ ఫిగర్ దాటిన డీఎంకే

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117ని డీఎంకే దాటేసింది. 

10:25 AM IST

యానాంలో మాజీ సీఎం రంగస్వామి ముందంజ

కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో మాజీ సీఎం రంగస్వామి ఆధిక్యంలో వున్నారు.,

10:13 AM IST

7,287 ఓట్ల ఆధిక్యంలో సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం ఆసక్తిని రేకిత్తిస్తోంది. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై సువేందు అధికారి 7,287 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 

10:05 AM IST

ఎక్కడ ఎవరు ఆధిక్యంలో వున్నారంటే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే కూటమి, పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి, అసోంలో బీజేపీ కూటమి, కేరళలో ఎల్డీఎఫ్ ఆధిక్యంలో నిలిచాయి

10:05 AM IST

బెంగాల్: మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన టీఎంసీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలా కనిపిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ తాజా ఫలితాల్లో మేజిక్ ఫిగర్‌ను దాటింది. ప్రస్తుతం టీఎంసీ 161, బీజేపీ 115 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. 

9:56 AM IST

నందిగ్రామ్‌లో దూసుకెళ్తున్న సువేందు

టీఎంసీకి రాజీనామాచేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని, బీజేపీ తరపున బరిలోఉన్న సువేందు అధికారి నందిగ్రామ్‌లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రెండో రౌండ్‌లోనూ 4,557 ఓట్ల వెనుకంజలో సీఎం మమత వున్నారు.

9:48 AM IST

ఆధిక్యంలో కేరళ సీఎం పినరయి విజయన్

ధర్మధామ్‌లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆధిక్యంలో వున్నారు. 

9:48 AM IST

వెనుకంజలో అసోం సీఎం

బీజేపీ నేత, అసోం సీఎం శర్బానంద సోనావాల్ మజోలిలో వెనుకంజలో వున్నారు. 

9:47 AM IST

నందిగ్రామ్‌లో వెనుకంజలో మమత

నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి 1000 ఓట్ల ఆధిక్యంలో వున్నారు

9:43 AM IST

వెనుకంజలో టీటీవీ దినకరన్

శశికళ మేనల్లుడు, టీటీవీ దినకరన్ కోవిల్‌పట్టిలో వెనుకంజలో వున్నారు. 
 
9:41 AM IST

కొలత్తూరులో స్టాలిన్ ముందంజ

డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్షనేత స్టాలిన్ కొలత్తూరులో ఆధిక్యంలో వున్నారు. 

9:38 AM IST

చెపాక్‌లో ఉదయనిధి స్టాలిన్ వెనుకంజ

డీఎంకే యువనేత, సినీ హీరో ఉదయనిధి స్ధాలిన్ చెపాక్‌లో వెనుకంజలో వున్నారు.

9:32 AM IST

మమతపై 1500 ఓట్ల ఆధిక్యంలో సువేందు

నందిగ్రామ్‌లో హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. తొలి రౌండ్‌లో సీఎం మమతా బెనర్జీపై సువేందు అధికారి 1,500 ఓట్ల ఆధిక్యంలో వున్నారు

9:29 AM IST

కోయంబత్తూరులో కమల్ హాసన్ ఆధిక్యం

కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన మక్కల్ నీది మయ్యం అధినేత, సినీనటుడు కమల్ హాసన్ స్వల్ప ఆధిక్యంలో వున్నారు.

9:27 AM IST

బోడినాయక్కనూర్‌లో పన్నీర్ సెల్వం ముందంజ

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అగ్రనేత పన్నీర్ సెల్వం.. బోడినాయక్కనూర్‌లో ఆధిక్యంలో వున్నారు.

9:23 AM IST

ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి ముందంజ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎడప్పాడి నుంచి బరిలో నిలిచిన ముఖ్యమంత్రి పళనిస్వామి ముందంజలో వున్నారు. 

9:20 AM IST

కేరళ: పాలక్కడ్‌లో మెట్రో శ్రీధరన్ ఆధిక్యం

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కడ్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధి మెట్రో శ్రీధరన్ ఆధిక్యంలో వున్నారు.

9:16 AM IST

బెంగాల్: క్రికెట్ మనోజ్ తివారి వెనుకంజ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీఎంసీ నుంచి పోటీ చేసిన క్రికెటర్ మనోజ్ తివారి వెనుకంజలో వున్నారు. ఈయన శివపూర్ నుంచి బరిలో నిలిచారు

9:09 AM IST

నందిగ్రామ్‌లో మళ్లీ సువేందు ఆధిక్యం

నందిగ్రామ్‌లో పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఇక్కడ మమతా బెనర్జీపై సువేందు మరోసారి ఆధిక్యంలోకి వచ్చారు.

9:07 AM IST

తమిళనాడులో దూసుకెళ్తున్న డీఎంకే

తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ డీఎంకే ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కట్టబెట్టినా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. డీఎంకే 42, అన్నాడీఎంకే 20 చోట్ల ముందంజలో వున్నాయి.

9:00 AM IST

అసోంలో ఆధిక్యంలో ఎన్డీఏ

ఈశాన్య భారతంలోని కీలక రాష్ట్రం అస్సోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో వుంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్డీఏ 22 చోట్ల, యూపీఏ 12 చోట్ల ఆధిక్యంలో వున్నాయి. 

8:54 AM IST

ఆధిక్యంలోకి వచ్చిన మమతా బెనర్జీ

నందిగ్రామ్‌లో పోరు నువ్వానేనా అన్నట్లుగా వుంది. పోస్టల్ బ్యాలెట్‌లలో సువేందు - దీదీలు హోరాహోరీగా తలపడుతున్నారు. సీఎం మమత బెనర్జీ తొలుత వెనుకబడ్డా తిరిగి ఆధిక్యంలోకి వచ్చారు.

8:50 AM IST

పోస్టల్ బ్యాలెట్లలో మమతపై సువేందు ఆధిపత్యం

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్‌లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఇందులో సీఎం మమతపై సువేందు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 

8:47 AM IST

కేరళ: ఎల్డీఎఫ్ 73, యూడీఎఫ్ 58 చోట్ల ఆధిక్యం

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక్కడ ఎల్డీఎఫ్ 73 చోట్ల, యూడీఎఫ్ 58 చోట్ల ఆధిక్యంలో వున్నాయి.

8:45 AM IST

టీఎంసీ 55, బీజేపీ 51 చోట్ల ఆధిక్యం

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. టీఎంసీ 55, బీజేపీ 51 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

8:40 AM IST

నందిగ్రామ్‌లో మమతపై సువేందు ఆధిక్యం

నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి ఆధిక్యంలో వున్నారు.

8:36 AM IST

బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ హోరాహోరీ

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీజేపీ- టీఎంసీల మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. టీఎంసీ 11 చోట్ల, బీజేపీ 10 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి,

8:14 AM IST

కేరళలో ఎల్‌డీఎఫ్ - యూడీఎఫ్ కూటముల మధ్య పోరు

కేరళ రాష్ట్రంలోని 140 సీట్లకు గాను ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో ఎన్నిక జరిగింది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుండి ఎంపీగా గెలుపొందడం, శబరిమల అంశము అన్ని వెరసి జాతీయ నాయకత్వమంతా కేరళలో తిష్ట వేసింది. ప్రధానంగా ఎల్ డి ఎఫ్, యూ డి ఎఫ్ కూటముల మధ్య పోరు సాగినప్పటికీ... తమ ప్రాబల్యాన్ని పెంచుకొని రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ సైతం ఇక్కడ భారీ ఎత్తున ప్రచారం సాగించింది. 
 
8:14 AM IST

అస్సాం ఎవరిదో

126 సీట్లున్న అస్సాం అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మార్చ్ 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6వ తేదీల్లో జరిగిన ఎన్నికల్లో సరాసరిన 82 శాతం వోటింగ్ నమోదయింది. అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేజిక్ నెంబర్ 64 సీట్లు.

7:27 AM IST

ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం లకు ఎన్నికలకు సంబంధించి మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు అన్ని చోట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించనున్నారు. 

10:56 PM IST

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌కు భారత ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 822 ఆర్ఓ‌లు, 7000కు పైగా ఏఆర్ఓలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లతో సహా సుమారు 95,000 కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ పక్రియ టాస్క్‌ను పర్యవేక్షిస్తారని ఆ ఉత్తర్వుల్లో ఈసీ తెలిపింది.

4:30 PM IST:

తీవ్ర ఉత్కంఠను రేపిన నందిగ్రామ్‌‌లో టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన విజయం నమోదు చేశారు. చివరి రౌండ్ వరకు ట్వంటి 20 మ్యాచ్‌ను తలపించిన పోరులో తన మాజీ అనుచరుడు, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారిపై 1200 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 
 
4:21 PM IST:

నందిగ్రామ్‌ ఫలితం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి, సీఎం మమతా బెనర్జీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు నడుస్తోంది. చివరి రౌండ్‌లో సువేందుపై మమతా బెనర్జీ 820 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. మరికాసేపట్లో తుది ఫలితం తేలనుంది.

3:45 PM IST:

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ప‌శ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ ఎన్నిక‌ల కౌంటింగ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. 17 రౌండ్ల కౌంటింగ్‌లో 16 రౌండ్లు ముగిసే స‌రికి ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీపై బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి కేవలం 6 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో చివ‌రి రౌండ్ కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.

3:35 PM IST:

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠను కలిగించిన నందిగ్రామ్‌లో టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ విజయానికి చేరువైనట్లుగా తెలుస్తోంది. తన సమీప ప్రత్యర్ధి బీజేపీ నేత సువేందు అధికారిపై దీదీ 8 వేల ఓట్ల తేడాతో ఆధిక్యంలో వున్నారు. ఇక మిగిలింది ఒక్క రౌండ్ మాత్రమే. దీంతో నందిగ్రామ్‌లో విజేత ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. 
 
3:23 PM IST:

నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాలు క్షణక్షణం ఆసక్తి కలిగిస్తున్నాయి. ఉదయం నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చిన బీజేపీ నేత సువేందు అధికారి ఒక్కసారిగా వెనుకబడిపోయారు. ప్రస్తుతం బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దాదాపు 8 వేల ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 
 
3:12 PM IST:

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్న బీజేపీకి తాజా ఫలితాలు షాకిచ్చాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ 200కు పైగా సీట్లలో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండటం, దీదీ సైతం నందిగ్రామ్‌లో పుంజుకోవడం కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం, ప్రచార సభలకు జనం నుంచి భారీగా స్పందన రావడంతో తమ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు భావించారు. అయితే ఫలితాలు అందుకు విరుద్ధంగా రావడంతో వారికి మింగుడు పడటం లేదు. దీనిపై ఆ పార్టీ పార్టీ సీనియర్ నేత కైలాస్ విజయవర్గీయ స్పందించారు. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదన్నారు. మమతా బెనర్జీ కాలికి గాయం కావడం టీఎంసీకి ఎక్కువ సీట్లు వచ్చాయని విజయ వర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
3:01 PM IST:

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. సినీనటుడు, బీజేపీ నేత సురేశ్ గోపీ త్రిసూర్‌లో ఓటమి పాలయ్యారు. అలాగే ముంజేశ్వర్ నుంచి బరిలోకి దిగిన కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ సైతం ఓడిపోయారు. 

2:48 PM IST:

నందిగ్రామ్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. తాజాగా పది రౌండ్లు ముగిసే సరికి 10 వేల ఆధిక్యంలో సువేందు అధికారి వున్నారు. అయితే ఆ కొద్దిసేపటికే దీదీ పుంజుకున్నారు. ప్రస్తుతం మమత 2,331 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 

2:42 PM IST:

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నందిగ్రామ్‌లో ఫలితం క్షణక్షణానికి ఉత్కంఠ కలిగిస్తోంది. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. తాజాగా పది రౌండ్లు ముగిసే సరికి 10 వేల ఆధిక్యంలో సువేందు అధికారి వున్నారు. ఈ నేపథ్యంలో మమత శిబిరంలో ఆందోళన నెలకొంది. 

2:33 PM IST:

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పూతుపల్లి స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ఉమెన్ చాందీ గెలుపొందారు.

2:23 PM IST:

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న టీఎంసీకీ, మమతా బెనర్జీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. దీదీ అద్బుతమైన పోరాటం చేశారని ఆయన కొనియాడారు. మరోవైపు తమిళనాడులో దాదాపు పదేళ్ల తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు కూడా కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. తమిళుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అద్భుతమైన పరిపాలన అందించాలని ఆయన ఆకాంక్షించారు.

2:11 PM IST:

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయోత్స ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కోవిడ్ విపత్కర పరిస్ధితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి విజయోత్స ర్యాలీలు నిర్వహిస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఇవి జరిగిన పోలీస్ స్టేషన్ ఎస్ఓహెచ్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సీఎస్‌లను ఈసీ ఆదేశించింది. 
 
2:06 PM IST:

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో బీజేపీపై విరుచుకుపడ్డారు శివసేన ఫైర్ బ్రాండ్, ఎంపీ సంజయ్ రౌత్. బెంగాల్‌లో మమత విజయం సాధిస్తే ప్రధాని మోడీ, అమిత్‌ షాలు వ్యక్తిగతంగా ఓడినట్లేనని సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపీకి బెంగాల్‌ ఫలితాల తర్వాత ఆందోళన తప్పదని ఆయన జోస్యం చెప్పారు. కరోనాను నియంత్రించడంలో విఫలమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇక స్థిరంగా ఉండలేదని సంజయ్ వ్యాఖ్యానించారు.

2:01 PM IST:

నందిగ్రామ్‌లో ఆధిక్యం దోబుచులాడుతోంది. ఏడో రౌండ్‌లో మమతా బెనర్జీ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. అయితే ఆ తర్వాత సువేందు అధికారి తిరిగి పుంజకున్న సువేందు 9,900 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. అనంతరం మళ్లీ మమత 1,427 ఓట్ల తేడాతో లీడ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం మళ్లీ సువేందు 3,800 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
1:54 PM IST:

ప‌శ్చిమ‌బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటంతో స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. మరోసారి సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్న టీఎంసీ అధినేత్రి మమ‌తాబెన‌ర్జికి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. దీదీ ఓ దీదీ అంటూ ప్ర‌ధాని మోడీ త‌న ఎన్నిక‌ల‌ ప్ర‌చార స‌భ‌ల్లో చేసిన వెక్కిరింత‌ల‌కు ఈ ఫ‌లితాలు గ‌ట్టి స‌మాధాన‌మ‌ని చెప్పాయని అఖిలేశ్ ఎద్దేవా చేశారు.

1:41 PM IST:

కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. గడిచిన 40 ఏళ్ల కాలంలో కేరళలో ఏ పార్టీ వరుసగా రెండోసారి విజయం సాధించలేదు. ఈ గెలుపుపై సీపీఎం నేత ప్రకాశం కారత్ స్పందించారు. పినరయి విజయన్ ప్రభుత్వ తీరును మెచ్చి ప్రజలు విజయాన్ని కట్టబెట్టారని ప్రశంసించారు. వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్ధితులతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కేరళ ప్రభుత్వం బాగా పనిచేసిందని ప్రకాశ్ కారత్ అన్నారు. 
 
1:26 PM IST:

స్పష్టమైన ఆధిక్యంతో  పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇంటిముందు  టీఎంసీ కార్యకర్తలు  సంబరాలు చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు  చేస్తూ సందడి చేశారు

1:13 PM IST:

నందిగ్రామ్‌లో ఆధిక్యం దోబుచులాడుతోంది. కొద్దిసేపటి క్రితం ఏడో రౌండ్‌లో మమతా బెనర్జీ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. అయితే ఆ తర్వాత సువేందు అధికారి తిరిగి పుంజకున్నారు. 8వ రౌండ్‌లో సువేందు 9,900 ఓట్ల ఆధిక్యంలో వున్నారు.

1:02 PM IST:

కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా త్రిసూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన సినీనటుడు సురేశ్ గోపీ ఆధిక్యంలో వున్నారు.

12:52 PM IST:

నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ- బీజేపీ నేత సువేందు అధికారి మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు జరుగుతుంది. ఆధిక్యం ఇద్దరి మధ్యా దోబుచులాడుతోంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం మమతా బెనర్జీ లీడ్‌లోకి వచ్చారు. సువేందుపై ఆమె దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యంలో వున్నారు.

12:46 PM IST:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో అన్నాడీఎంకే, ఏఎంఎంకే మధ్య ఘర్షణ జరిగింది. అరుప్పుక్కోట్టై అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి వైగై సెల్వన్, సత్తూర్ కౌంటింగ్ హాల్ వద్దకు వచ్చారు. దీంతో అన్నాడీఎంకే, ఏఎంఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగిరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. 

12:35 PM IST:

పుదుచ్చేరి మాజీ సీఎం రంగస్వామి యానాంలో వెనుకంజలో వున్నారు. ఆయనపై ఇండిపెండెంట్ అభ్యర్ధి 674 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 

12:26 PM IST:

ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటాన‌ని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌. అయితే ట్రెండ్స్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తేల్చ‌వ‌ని, మళ్లీ పుంజుకుని బీజేపీ అభ్యర్ధులు గెలుస్తారన్న నమ్మకం వుందని దిలీప్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
12:19 PM IST:

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో టీఎంసీ ఎదురులేకుండా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం తృణమూల్ కాంగ్రెస్ 206 చోట్ల ఆధిక్యంలో వుంది. 

12:07 PM IST:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే దూసుకుపోతోంది. మేజిక్ ఫిగర్‌ను దాటి ఆ పార్టీ ముందంజలో వుంది. ఈ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉదయనిధి స్టాలిన్‌ విక్టరీకి దగ్గరగా ఉన్నాడు. చెపాక్‌-తిరువళ్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉదయనిధిస్టాలిన్‌ పోటీలోకి దిగారు.
 
12:03 PM IST:

నందిగ్రామ్‌లో పోరు నువ్వా నేనా అన్నట్లుగా వుంది. కొద్దిసేపటి క్రితం మమతా బెనర్జీ పుంజుకోగా.. మళ్లీ వెంటనే సువేందు అధికారి లీడింగ్‌లోకి వచ్చారు.

11:58 AM IST:

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీకి ఊరట లభించింది. దాదాపు దశాబ్ధం తర్వాత అక్కడ బీజేపీ ఖాతా తెరిచింది. పుదుచ్చేరిలోని రెండు స్థానాల్లో కమల వికసించింది. 

11:41 AM IST:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులే ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టాయి. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న డీఎంకే నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

11:38 AM IST:

దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన నందిగ్రామ్ నియోజకవర్గంలో టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎట్టకేలకు పుంజుకున్నారు. అయినప్పటికీ బీజేపీ నేత సువేందు అధికారి 3,110 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 

11:31 AM IST:

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల అధికార పార్టీలు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. బెంగాల్లో‌ తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి, అసోంలో బీజేపీ వరుసగా రెండోసారి, కేరళలో ఎల్డీఎఫ్‌లు రెండోసారి అధికారంలోకి వచ్చాయి. 

11:20 AM IST:

దమ్ దమ్ నార్త్‌లో చంద్రీమా భట్టాచార్య, మదన్ మిత్రా కమర్హతిలో బ్రాత్యా బసు దమ్ దమ్‌లో, సింగూర్‌లో బెచరం మన్నా, హబ్రాలో జ్యోతిప్రియో ముల్లిక్ అధిక్యంలో వున్నారు.

11:04 AM IST:

ప‌శ్చిమ బెంగాల్‌లో ఎన్నికల్లో వింత ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. అక్క‌డ తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ‌రుస‌గా మూడోసారి అధికారం చేపట్టే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే ఆధిక్యాల ప‌రంగా టీఎంసీ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసింది. అయితే పార్టీ చీఫ్ , ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం నందిగ్రామ్‌లో వెనుకంజ‌లో ఉండ‌టం శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. నాలుగు రౌండ్ల ఓట్లు లెక్కింపు పూర్త‌య్యేస‌రికి నందిగ్రామ్‌లో మ‌మ‌త‌పై 8106 ఓట్ల తేడాతో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి ఉన్నారు.

11:01 AM IST:

బోడినాయక్కనూర్‌లో తమిళనాడు డిప్యూటీ సీఎం, అన్నాడీఎంకే అగ్రనేత పన్నీర్ సెల్వం 200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

10:53 AM IST:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చెపాక్‌లో బరిలోకి దిగిన డీఎంకే యువనేత, హీరో ఉదయ నిధి స్టాలిన్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు.

10:41 AM IST:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు జయకుమార్, రాజేంద్ర బాలాజీ, ఓఎస్ మణియన్, సీవీ షణ్ముగం వెనుకంజలో వున్నారు

10:28 AM IST:

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117ని డీఎంకే దాటేసింది. 

10:25 AM IST:

కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో మాజీ సీఎం రంగస్వామి ఆధిక్యంలో వున్నారు.,

10:13 AM IST:

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం ఆసక్తిని రేకిత్తిస్తోంది. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై సువేందు అధికారి 7,287 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 

10:09 AM IST:

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే కూటమి, పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి, అసోంలో బీజేపీ కూటమి, కేరళలో ఎల్డీఎఫ్ ఆధిక్యంలో నిలిచాయి

10:05 AM IST:

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలా కనిపిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ తాజా ఫలితాల్లో మేజిక్ ఫిగర్‌ను దాటింది. ప్రస్తుతం టీఎంసీ 161, బీజేపీ 115 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. 

9:56 AM IST:

టీఎంసీకి రాజీనామాచేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని, బీజేపీ తరపున బరిలోఉన్న సువేందు అధికారి నందిగ్రామ్‌లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రెండో రౌండ్‌లోనూ 4,557 ఓట్ల వెనుకంజలో సీఎం మమత వున్నారు.

9:48 AM IST:

ధర్మధామ్‌లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆధిక్యంలో వున్నారు. 

9:48 AM IST:

బీజేపీ నేత, అసోం సీఎం శర్బానంద సోనావాల్ మజోలిలో వెనుకంజలో వున్నారు. 

9:47 AM IST:

నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి 1000 ఓట్ల ఆధిక్యంలో వున్నారు

9:43 AM IST:

శశికళ మేనల్లుడు, టీటీవీ దినకరన్ కోవిల్‌పట్టిలో వెనుకంజలో వున్నారు. 
 
9:41 AM IST:

డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్షనేత స్టాలిన్ కొలత్తూరులో ఆధిక్యంలో వున్నారు. 

9:38 AM IST:

డీఎంకే యువనేత, సినీ హీరో ఉదయనిధి స్ధాలిన్ చెపాక్‌లో వెనుకంజలో వున్నారు.

9:32 AM IST:

నందిగ్రామ్‌లో హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. తొలి రౌండ్‌లో సీఎం మమతా బెనర్జీపై సువేందు అధికారి 1,500 ఓట్ల ఆధిక్యంలో వున్నారు

9:30 AM IST:

కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన మక్కల్ నీది మయ్యం అధినేత, సినీనటుడు కమల్ హాసన్ స్వల్ప ఆధిక్యంలో వున్నారు.

9:27 AM IST:

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అగ్రనేత పన్నీర్ సెల్వం.. బోడినాయక్కనూర్‌లో ఆధిక్యంలో వున్నారు.

9:23 AM IST:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎడప్పాడి నుంచి బరిలో నిలిచిన ముఖ్యమంత్రి పళనిస్వామి ముందంజలో వున్నారు. 

9:21 AM IST:

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కడ్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధి మెట్రో శ్రీధరన్ ఆధిక్యంలో వున్నారు.

9:16 AM IST:

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీఎంసీ నుంచి పోటీ చేసిన క్రికెటర్ మనోజ్ తివారి వెనుకంజలో వున్నారు. ఈయన శివపూర్ నుంచి బరిలో నిలిచారు

9:10 AM IST:

నందిగ్రామ్‌లో పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఇక్కడ మమతా బెనర్జీపై సువేందు మరోసారి ఆధిక్యంలోకి వచ్చారు.

9:07 AM IST:

తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ డీఎంకే ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కట్టబెట్టినా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. డీఎంకే 42, అన్నాడీఎంకే 20 చోట్ల ముందంజలో వున్నాయి.

9:00 AM IST:

ఈశాన్య భారతంలోని కీలక రాష్ట్రం అస్సోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో వుంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్డీఏ 22 చోట్ల, యూపీఏ 12 చోట్ల ఆధిక్యంలో వున్నాయి. 

8:54 AM IST:

నందిగ్రామ్‌లో పోరు నువ్వానేనా అన్నట్లుగా వుంది. పోస్టల్ బ్యాలెట్‌లలో సువేందు - దీదీలు హోరాహోరీగా తలపడుతున్నారు. సీఎం మమత బెనర్జీ తొలుత వెనుకబడ్డా తిరిగి ఆధిక్యంలోకి వచ్చారు.

8:50 AM IST:

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్‌లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఇందులో సీఎం మమతపై సువేందు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 

8:47 AM IST:

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక్కడ ఎల్డీఎఫ్ 73 చోట్ల, యూడీఎఫ్ 58 చోట్ల ఆధిక్యంలో వున్నాయి.

8:45 AM IST:

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. టీఎంసీ 55, బీజేపీ 51 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

8:40 AM IST:

నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి ఆధిక్యంలో వున్నారు.

8:37 AM IST:

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీజేపీ- టీఎంసీల మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. టీఎంసీ 11 చోట్ల, బీజేపీ 10 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి,

8:24 AM IST:

కేరళ రాష్ట్రంలోని 140 సీట్లకు గాను ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో ఎన్నిక జరిగింది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుండి ఎంపీగా గెలుపొందడం, శబరిమల అంశము అన్ని వెరసి జాతీయ నాయకత్వమంతా కేరళలో తిష్ట వేసింది. ప్రధానంగా ఎల్ డి ఎఫ్, యూ డి ఎఫ్ కూటముల మధ్య పోరు సాగినప్పటికీ... తమ ప్రాబల్యాన్ని పెంచుకొని రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ సైతం ఇక్కడ భారీ ఎత్తున ప్రచారం సాగించింది. 
 
8:22 AM IST:

126 సీట్లున్న అస్సాం అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మార్చ్ 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6వ తేదీల్లో జరిగిన ఎన్నికల్లో సరాసరిన 82 శాతం వోటింగ్ నమోదయింది. అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేజిక్ నెంబర్ 64 సీట్లు.

7:27 AM IST:

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం లకు ఎన్నికలకు సంబంధించి మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు అన్ని చోట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించనున్నారు. 

10:57 PM IST:

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌కు భారత ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 822 ఆర్ఓ‌లు, 7000కు పైగా ఏఆర్ఓలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లతో సహా సుమారు 95,000 కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ పక్రియ టాస్క్‌ను పర్యవేక్షిస్తారని ఆ ఉత్తర్వుల్లో ఈసీ తెలిపింది.

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌కు భారత ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.