కడుపుతో ఉన్న యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరి దాటికి ఆ బాలిక గర్భం కోల్పోయింది. అయితే.... ఇదంతా తన కళ్ల ముందే జరుగుతున్నా... కాపాడలేకపోయాననే బాధతో.. ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గత నెల చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గత నెల జులై 13వ తేదీన దళిత యువతీయువకులు బైక్ పై వెళుతుండగా... వారిని నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. కత్తులు, రాడ్లు చేతపట్టుకొని వారిపై దాడి చేశారు. యువకుడిని కొట్టి... అతని సెల్ ఫోన్ ని లాక్కున్నారు. అనంతరం యువకుడిని అక్కడి నుంచి బయటకు పంపించేసి... యువతిని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లారు. 

ఒకరి తర్వాత ఒకరు యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరి పాశవిక దాడితో యువతికి గర్భస్రావం అయ్యింది. తన కళ్లముందే ఇంత దారుణం జరుగుతున్నా.. తన ప్రియురాలిని కాపాడుకోలేకపోయాననే బాధతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులును తాజాగా అరెస్టు చేశారు. హత్య కేసు సహా, కిడ్నాప్, సామూహిక అత్యాచారాం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు.