ముంబయి ఎయిర్ పోర్టులో  భారీ మోతాదులో డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు రూ.వెయ్యి కోట్లు విలువచేసే డ్రగ్స్ ని కష్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

ముంబయి నుంచి హైదరాబాద్,బెంగళూరు, చెన్నై, పాండిచేరి ప్రాంతాలకు ఈ డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల దగ్గర నుంచి పూర్తి వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.