నాలుగేళ్లపై బాలికపై రేప్: చంపేసి కంటైనర్లో పడేశాడు

First Published 2, Jun 2018, 8:53 PM IST
4-year-old raped, stabbed to death, dumped in container
Highlights

హర్యానాలోని ఫరీదాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 

ఫరిదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత చంపేశాడు. శవాన్ని కంటైనర్ లో పడేశాడు. 

ఈ సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్ పాల్వాల్ గల అసౌటీ గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడు బాలిక తండ్రి నడిపే స్వీట్ షాప్ లో ఉద్యోగి అని తెలుస్తోంది. కంటైనర్ లో కుక్కి, శవాన్ని తన నివాసంలో పెట్టాడు. 

24 ఏళ్ల నిందితుడు భోలా అలియాస్ వీరేందర్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బాలికను ఇంటి వద్ద వదులుతానని చెప్పి స్వీట్ షాపు నుంచి బయలుదేరాడు.  ఇద్దరు కూడా సాయంత్రం వరకు కనిపించలేదు. 

బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి భోలా ఇంటికి వెళ్లారు. అక్కడ కంటైనర్ లో నాలుగేళ్ల బాలిక శవాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. భోలాకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. అయితే భార్య అతనితో ఉండడం లేదు.

loader