చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన  చోటు చేసుకొంది. సమీప బంధువే ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడు మాజీ ఆర్మీ జవానుగా పోలీసులు చెబుతున్నారు.

చెన్నైలోని హిందూజనగర్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.  సెల్వీ, రాజేంద్రన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. గురువారం సాయంత్రం కొడుకును ట్యూషన్‌ను కొడుకును దించి వెళ్లి వచ్చేలోపుగా సమీప బంధువు మీనాక్షి సుందరం అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు

ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని  మీనాక్షి సుందరం  రాజేంద్రన్ ఇంట్లోకి వెళ్లి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత  ఆ బాలికను చంపేసి బకెట్‌లో ముంచేశాడు. 

కొడుకును ట్యూషన్ నుండి దింపి ఇంటికి వచ్చేసరికి నాలుగేళ్ల చిన్నారి మృతి చెంది ఉండడాన్ని  చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే సమీప బంధువే ఈ దారుణానికి పాల్పడినట్టుగా  గుర్తించిన స్థానికులు మీనాక్షి సుందరంపై దాడికి దిగారు.ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.