225 అడుగుల బోరుబావిలో పడిన చిన్నారి, కొనసాగుతున్న సహాయక చర్యలు

3 years old girl falls into 225 foots borewell in bihar
Highlights

పూడ్చకుండా వదిలేసిన బోరుబావులు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. ఇదివరకు ఎన్ని ఘటనలు జరిగినా, ప్రభుత్వాలు, పోలీసులు ఎంత హెచ్చరించినా ప్రజల్లో మాత్రం మార్పురావడం లేదు. బోర్లు వేయడం...వాటిలో నీరు రాకపోవడంతో అలాగే పూడ్చకుండా వదిలేయడం పరిపాటిగా మారింది. ఇలా పూడ్చకుండా వదిలేసిన 225 అడుగుల లోతు బోరుబావిలో ఓ మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. అయితే చిన్నారి ఇంకా ప్రాణాలతోనే ఉండటంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

బీహర్ లోని ముంగేర్ జిల్లాలోని ఓ గ్రామంలో గ్రామ సమీపంలో ఓ వ్యక్తి బోరుబావిని తవ్వించాడు. అయితే 225 అడుగుల లోతు తవ్వించినప్పటికి చుక్క నీరు రాలేదు. దీంతో అతడు బోరుబావిని పూడ్చకుండా అలాగే  వదిలేసాడు. అయితే గ్రామానికి సమీపంలో వున్న ఈ బోరుబావిలో మంగళవారం సాయంత్రం ఓ మూడేళ్ల చిన్నారి పడిపోయింది.తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి ఎలాంటి రక్షణ లేకుండా ఉన్న బోరుబావిలో పడిపోయింది.   

ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని కాపాడటానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. బాలిక 48 అడుగుల లోతులో చిక్కుకుందని, ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోరుబావిలోకి పైపులు ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. అలాగే సిసి కెమెరాలను కూడా పంపించి పాప కదలికలను గమనిస్తున్నారు.

చిన్నారిని కాపాడటానికి బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్వుతున్నారు. 32 అడుగుల నిలువుగా, మరో 16 అడుగులు  అడ్డంగా గొయ్యి తవ్వి పాపను బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
loader