పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఓ వ్యక్తి తన సొంత చెల్లెలిపై దాడి చేశాడు. కాగా... బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె సోదరుడిని,అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బులంద్ షహర్ జిల్లా గులోతి ప్రాంతానికి చెందిన సల్మా అనే యువతి పైళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వద్దని ఆమె సోదరుడు ఇర్ఫాన్ చాలా సార్లు మందలించాడు. అయినా ఆమె తన తీరు మార్చుకోలేదు.దీంతో.. ఆమెను చంపేందుకు తన స్నేహితులతో కలిసి పథకం రచించాడు.

పథకం ప్రకారం సోదరి సల్మాను బయటకు తీసుకువెళ్లి ఆమెపై కర్రలతో దాడి చేశారు. ఆమెను దారుణంగా కొట్టి చనిపోయిందనుకొని వాళ్లు ఇంటికి వెళ్లిపోయారు. కొద్ది సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన సల్మా... స్థానికులు సహాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందింది. అంనతరం తన సోదరుడు, అతని మిత్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.