చెన్నై: తమిళనాడులోని వెల్లూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు 24 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. దానికి ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ ను తీవ్రంగా కొట్టారు. అతి వద్ద ఉన్న వస్తువులను లాక్కున్నారు. 

వెల్లూరులోని నడిబొడ్డులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వెల్లూరులోని ప్రధాన కూడలిలో గల 16వ సెంచరీ వెల్లూరు ఫోర్టు సమీపంలోని పార్కులో శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆ దారుణం చోటు చేసుకుంది.

Also Read: గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్: చికిత్స పొందుతూ యువతి మృతి

పోలీసుుల 18 ఏళ్ల వయస్సు గల ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. అత్యాచారం, దోపిడీ కింద పోలీసులు కేసులను నమోదు చేశారు. 

Alao Read: మెట్రో స్టేషన్ నుంచి ఆటోలో కిడ్నాప్ చేసి మహిళపై గ్యాంగ్ రేప్

2018లో ప్రతి 15 నిమిషాలకు ఒకరు అత్యాచారానికి గురైనట్లు ప్రభుత్వం ఈ నెలలో విడుదల చేసిన గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం... 2018లో 34 వేల అత్యాచారాలు జరగ్గా 85 శాతం అభియోగాల వరకే పరిమితమయ్యాయి. 27 శాతం కేసుల్లో దోషులకు శిక్ష పడింది.  

Also Read: తెలంగాణలో మరో ఘోరం: వివాహితపై గ్యాంగ్ రేప్, హత్య