Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం: నదిలో పడ్డ పెళ్లి బస్సు, 24 మంది మృతి

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. బుధవారం నాడు ఉదయం పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడింది. ఈ ఘటనో 24 మంది మృతి చెందారు. 

24 dead as bus falls off bridge in Rajasthan's Boondi
Author
Rajasthan, First Published Feb 26, 2020, 12:20 PM IST


జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని  కోటలాల్‌సోట్ వద్ద బుధవారం నాడు ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. నదిలో పెళ్లి బృందం ప్రయాణీస్తున్న బస్సు పడింది. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

 పెళ్లి బృందం ప్రయాణం చేస్తున్న బస్సు కోటలాల్‌సోట్ వద్ద నదిలో పడింది. పెళ్లి  వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు.

నదిలో చిక్కుకొన్న పెళ్లి బృందాన్ని స్థానికులు అధికారులు రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  బుధవారం నాడు ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  బ్రిడ్జి పై నుండి నదిలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో నీటి ప్రవాహం చిక్కుొకొన్న వారిని అధికారులు రక్షించేందుకు  ప్రయత్నిస్తున్నారు.

Also read: ఢిల్లీ అల్లర్లు: 20 మంది మృతి, సైన్యాన్ని దింపాలని కేజ్రీవాల్

  కోటా జిల్లాలోని సామైమాధోపూర్ కు చెందిన వారు ఈ బస్సులో ఉన్నారు. బస్సు అతి వేగంగా  మెజ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి నుండి  కిందపడిపోయింది. ఈ ఘటన పాపిడి గ్రామానికి సమీపంలో చోటు చేసుకొంది. 

సంఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నదిలో బస్సు పడిపోగానే నీటి ప్రవాహానికి కొందరు కొట్టుకుపోయారు. మరికొందరిని స్థానికులు రక్షించారు.  సంఘటన స్థలంలోనే 10 మంది మృతి చెందారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 14 మంది చనిపోయారు. మృతుల్లో 11 మంది పురుషులు,  10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.క్షతగాత్రులను లేఖరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తీవ్రంగా గాయపడిన వారిని కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios