Asianet News TeluguAsianet News Telugu

22ఏళ్ల క్రితం అత్యాచారం.. నిందితుడిపై ఛార్జ్ షీట్..!

సదరు నిందితుడు 1999 నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు కాగా.. జుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా.. ఈ రేప్ కేసులో మిగిలిన ఇద్దరు నిందితులు 1999లోనే పోలీసులకు చిక్కారు. 

22 years after gangrape, CBI files supplementary chargesheet against third accused
Author
Hyderabad, First Published May 13, 2021, 9:21 AM IST


22ఏళ్ల క్రితం జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి తాజాగా నిందితుడిపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ సంఘటన ఒడిస్సాలో చోటుచేసుకుంది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన రేప్ ఘటనకు సంబంధించి... సీబీఐ అధికారులు మూడో నిందితుడిపై అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

సదరు నిందితుడు 1999 నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు కాగా.. జుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా.. ఈ రేప్ కేసులో మిగిలిన ఇద్దరు నిందితులు 1999లోనే పోలీసులకు చిక్కారు. వారికి 2002లో భువనేశ్వర్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.

ఈ ఘటన 1999లో చోటుచేసుకుంది. బాధితురాలు ట్యాక్సీలో కటక్ వెళుతుండగా... ముగ్గురు దుండగులు ఆమెను అడ్డుకున్నారు. ఆ ట్యాక్సీని దుండగులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాధితురాలిని కారులో లైంగిక దాడికి పాల్పడి.. ఆ తర్వాత కారులో నుంచి కింద పడేసి.. పొలాల్లోకి లాక్కెల్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

వారు చేసిన నేరం నిరూపితం కావడంతో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు పడింది. కానీ.. మూడో నిందితుడు తప్పించుకు తిరుగుతూ..  దాదాపు 22 ఏళ్ల తర్వాత సీబీఐ అధికారులకు చిక్కాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios