ISRO: 2024 సంవత్సరం గగన్‌యాన్‌దే: ఇస్రో.. గగన్‌యాన్ మిషన్ ఏమిటీ?
ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఈ రోజు గగన్‌యాన్ గురించి మాట్లాడారు. ఎక్స్‌పోశాట్‌ను విజయవంతంగా ప్రయోగించిన అనంతరం, మాట్లాడుతూ.. ఈ ఏడాది గగన్‌యాన్‌దే అని అన్నారు. 2025లో గగన్‌యాన్ వాస్తవరూపం దాల్చడానికి అవసరమైన అన్ని పరీక్షలు, ప్రయోగాలు 2024లోనే చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇంతకీ ఈ గగన్‌యాన్ మిషన్ ఏమిటీ? దాని లక్ష్యం ఏమిటీ?
Gaganyaan Mission: భారత్ అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్నది. అమెరికా, రష్యా, చైనాలకు ధీటుగా నిలుస్తున్నది. తక్కువ నిధులతోనే ఎవరూ ఊహించని ఫలితాలను సాధిస్తున్నది. ఈ రోజు ఉదయం కూడా ఇస్రో ఓ ప్రయోగాన్ని చేపట్టింది. కొత్త సంవత్సరం తొలి రోజే XPoSatను విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా ఈస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ గగన్‌యాన్ మిషన్‌ను ప్రస్తావించారు. సక్సెస్‌ఫుల్ లాంచ్‌తో ఈ సంవత్సరం ప్రారంభించిన ఇస్రో ఈ ఏడాదిని గగన్‌యాన్‌కు అంకితం చేయనుంది. ఈ ఏడాది గగన్‌యాన్‌దే అని సోమనాథ్ అన్నారు.
2024లో గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన చాలా టెస్టులు చేయాల్సి ఉన్నదని, తద్వారా 2025లో ఈ మిషన్‌ను సక్సెస్ చేయాల్సి ఉన్నదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఎన్నో టెస్టులు, పరిశోధనలు ఈ గగన్‌యాన్ కోసం 2024లో చేయాల్సి ఉన్నదని వివరించారు. మానవ సహిత అంతిరక్ష ప్రయోగమే ఈ గగన్‌యాన్ మిషన్. మనుషులను అంతరిక్షంలోకి మోసుకెళ్లి మళ్లీ సురక్షితంగా వారిని వెనక్కి తీసుకురావడం ఈ గగన్‌యాన్ మిషన్ లక్ష్యం.
Also Read: Bihar: బిహార్‌లో మరో విచిత్ర చోరీ.. రాత్రికి రాత్రే చెరువు మాయం.. పొద్దునే దానిపై ఇల్లు
గగన్‌యాన్ మిషన్ గురించి..
ఇస్రో ప్రకారం, గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ముగ్గురు సిబ్బందిని అంతరిక్షంలోకి పంపాలి. 400 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలోకి వారిని పంపించారు. మళ్లీ వారిని సేఫ్‌గా భూమి మీదికి తీసుకురావాలి. భారత జలాల్లో వారిని ల్యాండ్ చేయించి తీసుకురావాలి. ఇది మూడు రోజుల మిషన్.
ఈ ప్రాజెక్టులో దాదాపుగా మన దేశీయ విజ్ఞానాన్నే ఉపయోగించనున్నారు. మన దేశానికి చెందిన నిపుణులు, పరిశోధకులు, విద్యావంతులు, ఇండస్ట్రీ అనుభవాల ద్వారా.. అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని ఈ ప్రయోగం చేయాల్సి ఉన్నది.
గగన్‌యాన్ ప్రాజెక్టులో అనేక భాగాలు ఉన్నాయి. అనేక సంక్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధఇ చేయాల్సి ఉన్నది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లే సాంకేతికత, అక్కడ అంతరిక్షంలో సురక్షితంగా వారు మెదిలేలా.. ఇక్కడి వాతావరణాన్ని మెయింటెయిన్ చేసే టెక్నాలజీ, అత్యవసర పరిస్థితుల్లో క్రూ ఎమర్జెన్సీ ఎస్కేప్ వెసులుబాటు, అలాగే.. అంతరిక్షంలోకి వెళ్లే సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలు ఉంటాయి.