Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ కేసులో మరో ట్విస్ట్: ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన దోషి

నిర్భయ కేసులో మరణశిక్ష పడిన నలుగురు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాడు. తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించిన సమయంలో ఢిల్లీలో ఎన్నికల కోడ్ ఉందని చెప్పాడు.

2012 Delhi gangrape convict now moves Election Commission to challenge rejection of his mercy plea
Author
Delhi, First Published Feb 21, 2020, 12:21 PM IST

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మ మరణశిక్షను తప్పించుకునేందుకు మరో ఎత్తు వేశాడు. తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించడంపై ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాడు. తన క్షమాబిక్ష పిటిషన్ ను తిరస్కరించిన సమయంలో ఢిల్లీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పాడు. 

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించే అధికారం మంత్రి మనీష్ సిసోడియాకు లేదని ఆయన అన్నాడు. వినయ్ పిటిషన్ పై సోసిడియా డిజిటల్ సంతకం చేయాల్సి ఉందని, అలా కాకుండా క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు వాట్సాప్ స్క్రీన్ షాట్ పంపించారని ఏపీ సింగ్ చెప్పారు.

Also Read: నా కూతురికి న్యాయం జరగకుంటే... నిర్భయ తల్లి షాకింగ్ కామెంట్స్ 

మెర్సీ పిటిషన్ ను ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపించింది. ఆ తర్వాత అది రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రకటించారు. మెర్సీ పిటిషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 14వ తేదీన తోసిపుచ్చింది. 

వినయ్ శర్మ క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు జనవరి 14వ తేదీన తోసిపుచ్చింది. తల గాయానికి, కుడి చేతి ఫ్రాక్చర్ కు, మానసిక అనారోగ్యానికి, స్కిజోఫ్రెనియాకు తనకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్న కొద్ది గంటల్లోనే వినయ్ శర్మ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాడు.

Also Read: నిర్భయ కేసు: తలను గోడకేసి కొట్టుకున్న దోషి వినయ్ శర్మ

నిర్భయ కేసులో అక్షయ్ ఠాకూర్, ముకేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మకు మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష వేయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దాని నుంచి తప్పించకోవడానికి వినయ్ శర్మ చేయని ప్రయత్నమంటూ లేదు. 

ఫిజియోథెరపీ విద్యార్థిని నిర్భయను 2012 డిసెంబర్ 16వ తేదీన ఆరుగురు వ్యక్తులు రేప్ చేసి, చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె రెండు వారాల తర్వాత మరణించింది. నిందితుల్లో ఒక్కడు మైనర్ అయినందున అతను శిక్ష అనుభవించి 2015 డిసెంబర్ లో విడుదలయ్యాడు. మరో నిందితుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios