పానాజీ: గోవా విమానాశ్రయం వద్ద ఓ టాక్సీ డ్రైవర్ 20 ఏళ్ల వయస్సు గల యువతిపై అత్యాచారం చేశాడు. పానాజీకి 40 కిలోమీటర్ల దూరంలో గల వాస్కో పట్టణంలోని విమానాశ్రయం వద్ద ఆ సంఘటన చోటు చేసుకుంది. 

గత సాయంత్రం ఈ సంఘటన జరిగింది. నిందితుడిని రవిచంద్ర భట్ (48) గుర్తించారు. అతన్ని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. వాస్కోలోని ఎయిర్ పోర్టు రోడ్డులో ఒంటరిగా నడుస్తున్న మహిళను రవిచంద్ర భట్ చూశాడని, ఆమెకు లిఫ్ట్ ఇస్తానని చెప్పాడని పోలీసులు తెలిపారు.

ఆమె టాక్సీలో ఎక్కడానికి నిరాకరించడంతో బలవంతం వాహనంలోకి లాక్కున్నాడని, నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచార చేశాడని పోలీసులు తెలిపారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్కోలో నివసిస్తున్న భట్ ఎయిర్ పోర్టుకు టాక్సీ నడుపుతుంటాడు.