లక్నో: ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇద్దరు దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. 
 
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బండ జిల్లాకు చెందిన లవలేష్, సురేష్ లు 2019 జనవరి నెలలో ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

నిందితులు పాల్పడిన నేరానికి సంబంధించి సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించారు.  దీంతో నిందితులకు 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 50 వేల జరిమానాను విధిస్తూ ప్రత్యేక జడ్జి పవన్ కుమార్ శర్మ తీర్పు చెప్పారు.

బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన దోషులకు జడ్జికి జైలు శిక్ష విధిస్తూ వెలువరించిన తీర్పు వివరాలను ప్రభుత్వ న్యాయవాది రాంసుఫాల్ సింగ్ మీడియాకు వివరించారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకొంటున్నా ఈ తరహా ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.