అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులకు డ్రగ్స్ ఇచ్చి..  ఇద్దరు వ్యక్తులు వారిపై అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చంద్రపూర్ కి చెందిన ఇద్దరు బాలికలు సమీపంలోని రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు. కాగా.. ఆ స్కూల్లో హాస్టల్ సూపరిండెంట్ గా పనిచేసే చాబన్ పచారే, డిప్యుటీ సూపరిండెంట్ నరేంద్ర విరుక్తర్ ల కన్ను.. ఆ ఇద్దరు బాలికలపై పడింది. స్కూల్లో పనిచేసే ఇద్దరు మహిళా సిబ్బంది సహాయంతో.. ఇద్దరు బాలికలకు డ్రగ్స్ ఇచ్చారు.

వారు మత్తులోకి జారుకోగానే.. అత్యాచారిని ఓడిగట్టారు. బాలికలు అనారోగ్యానికి గురవ్వడంతో ఆస్పత్రికి తరలించగా.. వారిపై అత్యాచారం జరిగిందని.. అధిక మోతాలో డ్రగ్స్ ఇచ్చినట్లు గుర్తించారు. చిన్నారులు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాలికలపై అఘాయిత్యానికి పాల్పడినవారిని, వారికి సహకరించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.  పోస్కో చట్టం, బాలికలు ట్రైబల్స్ కావడంతో.. ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు.