దిశ ఘటన తర్వాత టోల్‌ప్లాజాల వైపు వెళ్లాలంటేనే మహిళలు, యువతులు వణికిపోతున్నారు. వారు భయపడుతున్నట్లుగానే తాజాగా ఓ మహిళపై మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.... పంజాబ్‌కు చెందిన భార్యాభర్తలు తమ బందువులను కలవడానికి ఫిబ్రవరి 16న పానిపట్‌కు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి వారు బస్సులో తిరిగి ప్రయాణమయ్యారు.

Also Read:హోటల్ గదిలో యువతిపై ఇద్దరు పోలీసులు రేప్

అయితే మార్గమధ్యంలో తమ సన్నిహితుల వద్ద నగదు తీసుకోవడానికి రాత్రి 11 గంటల సమయంలో కర్నల్‌లోని ఓ టోల్‌ప్లాజా వద్దకు వెళ్లారు. ఈ సమయంలో బాధితురాలు మూత్ర విసర్జన కోసం పక్కనే వున్న పొలల్లోకి వెళ్లింది.

వీరిద్దరిని ఎప్పటి నుంచో గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమె వెనకాలే వెళ్లే కత్తితో బెదిరించారు. వివాహితను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు.

Also Read:16 ఏళ్ల అమ్మాయిపై ఆరు నెలలుగా పదిమంది గ్యాంగ్ రేప్

అక్కడితో ఆగకుండా ఘటన జరిగిన ప్రాంతంలో వారి మొబైల్‌ నెంబర్లను వదిలి వెళ్లారు. ఎలాగో అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు భర్త దగ్గరికి వచ్చి.. తనపై జరిగిన దారుణాన్ని చెప్పింది. అప్పటికే అర్థరాత్రి కావడంతో ఇద్దరు కలిసి సోమవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలంలో లభించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని టోల్‌ప్లాజా సమీపంలో తినుబండారాలు అమ్మే మేఘరాజ్, సోనూలుగా గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు.