మైనర్‌బాలికపై రేప్: రేపిస్టులకు షాకిచ్చిన కుక్క

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 21, Aug 2018, 10:59 AM IST
2 men rape 14-yr-old, attacked, chased away by her dog in Madhya Pradesh
Highlights

:మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు  కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడుతుండగా  బాధితురాలి పెంపుడు కుక్క వచ్చి ఆమెను కాపాడింది. నిందితులను కరిచింది. నిందితులు బాలికను విడిచిపారిపోయేలా చేసింది. 


భోపాల్:మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు  కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడుతుండగా  బాధితురాలి పెంపుడు కుక్క వచ్చి ఆమెను కాపాడింది. నిందితులను కరిచింది. నిందితులు బాలికను విడిచిపారిపోయేలా చేసింది. ఈ ఘటన  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలోని కరీలా గ్రామంలో  శుక్రవారం రాత్రి పూట ఈ ఘటన చోటు చేసుకొంది.  బాధితురాలు దోమలను  తరిమేందుకుగాను  గడ్డిని తెచ్చేందుకు రాత్రిపూట బయటకు వచ్చింది.

అయితే అయిస్ అహిర్వార్, పునీత్ అహిర్వార్‌లు మైనర్ బాలిక ఒక్కతే రాత్రిపూట బయటకు వచ్చిన విషయాన్ని గుర్తించారు. ఆ బాలికను సమీపంలోని  గుడిసెలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ సమయంలో  రక్షించాలంటూ గట్టిగా కేకలు వేసింది.

 

 

బాదితురాలి కేకలను విన్న  ఆమె పెంపుడు కుక్క సంఘటనా స్థలానికి చేరుకొంది. నిందితుల్లో ఒక్కరిని కరిచింది. దీంతో ఒక్క నిందితుడు  కుక్కపై కత్తితో దాడి చేశాడు. అయినా కూడ ఆ కుక్క మాత్రం వదిలిపెట్టలేదు.

నిందితులపై దాడులకు పాల్పడుతూనే ఉంది. అంతేకాదు గట్టిగా మోరిగింది. ఈ కుక్క అరుపులకు ఇతర కుక్కలు కూడ అరవడం ప్రారంభించాయి. ఇదే సమయంలో ఆ బాలిక అక్కడి నుండి తన ఇంటికి పారిపోయింది.

కుక్కల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు  సంఘటనాస్థలానికి చేరుకొన్నారు.  ఇరుగుపొరుగు వారు వస్తున్న విషయాన్ని గుర్తించిన ఇద్దరు నిందితులు పారిపోయారు. అయితే బాధిత కుటుంబసభ్యులు  ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితులను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. 

ఈ వార్తలు చదవండి

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

ట్విస్ట్: కోర్కె తీర్చలేదని భార్యపై దాడి, పోలీసులకు షాకిచ్చిన భార్య

ఆర్నెళ్ల క్రితం లవ్ మ్యారేజ్: పుట్టింట్లో ఉన్న భార్యను చంపిన భర్త

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader