ఆగ్రా:  ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆగ్రాకు చెందిన 18 ఏళ్ల బాలికపై ఆమె సమీప బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  బాధితురాలు పొదల్లో అపస్మారకస్థితిలో ఉండడాన్ని చూసిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన ఆగ్రాకు సమీపంలోని పోహియా గ్రామంలో చోటు చేసుకొంది. బాలికపై అత్యాచారానికి పాల్పడింది ఆమె  సమీప బంధువుగా గుర్తించారు.బాధితురాలు తన తల్లితో కలిసి ఓ పెళ్లికి హాజరైంది. 

 అయితే ఆమెను నిందితుడు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.రెండు గంటలైనా కూడ తన కూతురు రాలేదని  బాధితురాలు  ఆ ప్రాంతంలో వెతికింది. అయితే సమీపంలోని పొదల్లో బాధితురాలు అపస్మాకరస్థితిలో పడి కన్పించింది.నిందితుడిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  బాధితురాలిని పరీక్షల నిమిత్తం పోలీసులు  ఆసుపత్రికి తరలించారు.