Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో మైనర్ బాలుడు

ఆమెతో స్నేహంగా మెలిగేవాడు. కాగా.. బాలికకు వేరే ప్రాంతంలో మంచి ఉద్యోగం.. ఎక్కువ జీతం వచ్చే పని ఇప్పిస్తానంటూ నమ్మించాడు.

17-Year-Old, Others Allegedly Rape Girl, 14, In Posh South Delhi Locality
Author
Hyderabad, First Published Dec 21, 2020, 9:33 AM IST

ఇళ్లల్లో పనిచేసుకుంటూ.. కుటుంబానికి అండగా నిలుస్తున్న ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.  కాగా.. నిందితుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉండటం గమనార్హం. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతానికి చెందిన ఓ 14ఏళ్ల మైనర్ బాలిక కొందరు ఇళ్లల్లో పనిచేస్తోంది. ఆ పనిచేసే ప్రాంతంలో బాలికకు ఓ మైనర్ బాలుడు పరిచయం అయ్యాడు. ఆమెతో స్నేహంగా మెలిగేవాడు. కాగా.. బాలికకు వేరే ప్రాంతంలో మంచి ఉద్యోగం.. ఎక్కువ జీతం వచ్చే పని ఇప్పిస్తానంటూ నమ్మించాడు. 

ఈ క్రమంలో చేస్తున్న పని మానేసిన బాలిక.. సదరు బాలుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. శనివారం బాలికను ఓ ప్రాంతానికి తీసుకువెళ్లిన ఆ బాలుడు.. మరో ముగ్గురి సహాయంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని తర్వాత ఆ ముగ్గురు కూడా ఒకరి తర్వాత మరొకరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆదివారం కుటుంబసభ్యులకు విషయాన్ని తెలియజేసిన బాలిక.. వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 
  

Follow Us:
Download App:
  • android
  • ios