కురుక్షేత్ర: హర్యానాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 17 ఏల్ల అమ్మాయికి మత్తు మందు ఇచ్చి ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అమ్మాయి 12వ తరగతి చదువుతోంది. అఘాయిత్యానికి పాల్పడినవారిలో అమ్మాయి కజిన్ మిత్రుడు ఉన్నాడు.

ఆ సంఘటన కురుక్షేత్ర జిల్లాలోని అమ్మాయి గ్రామానికి సమీపంలో జరిగింది. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ముగ్గురిలో ఇద్దరు 18 ఏళ్ల వయస్సు గల యువకులు కాగా, మరొకతను మైనర్ బాలుడు. మైనర్ బాలుడిని అబ్జర్వేషన్ హోంకు పంపించారు. 

పాఠశాల నుంచి ఫిబ్రవరి 22వ తేదీన బాధితురాలు ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమెకు కళ్లు తిరిగినట్లు అనిపించింది. తన కజిన్ ఇంటి వద్ద దిగబెడుతాడని ఫ్రెండ్ చెప్పింది. అయితే, అతను అమ్మాయిని కురుక్షేత్రలోని ఉమ్రి చౌక్ సమీపానికి తీసుకుని వెళ్లాడు. 

అక్కడి హోటల్లో మైనర్ బాలుడితో పాటు నలుగురు నిందితులు పనిచేస్తూ ఉంటారు. అతను అమ్మాయిని తీసుకుని వెళ్లేసరికి ఆ నలుగురు అక్కడ ఉన్నారు. అందరూ కలిసి అమ్మాయిపై అత్యాచారం చేశారు. అఘాయిత్యానికి పాల్పడే సమయంలో కూడా బాధితురాలికి మత్తు మందు ఇచ్చారు. 

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు జనవరి 22వ తేదీన అమ్మాయిని ఉదయం 7 గంటలకు తండ్రి పాఠశాల వద్ద దింపాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఆమె ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సు కోసం మధ్యాహ్నం 1.30 గంటలకు వెళ్తుంది. సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వస్తుంది. 

సాయంత్రానికి కూడా అమ్మాయి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు దాంతో కోచింగ్ సెంటర్ కు ఫోన్ చేసి అడిగారు. ఆ రోజు అక్కడికి రాలేదని వారు చెప్పారు సాయంత్రం 7 గంటల వరకు అమ్మాయి కోసం తల్లిదండ్రులు వెతుకుతూనే ఉన్నారు.

పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా తల్లిదండ్రులకు తమ కూతురు లాడ్వా టౌన్ నుంచి మోటార్ సైకిల్ మీద ఇద్దరు యువకులతో వస్తుండడం కనిపించింది. స్కూల్ డ్రెస్సులోనే బాలిక మోటార్ సైకిల్ మీద ఇద్దరి మధ్య కూర్చుని ఉంది. వెనక కూర్చున్న యువకుడు ఆమె తలకు గన్ గురి పెట్టి కనిపించాడు. 

మోటార్ సైకిల్ ను అడ్డుకుని తల్లిదండ్రులు ఆమ్మాయిని రక్షించారు. ఆ సమయంలో కూడా అమ్మాయి మత్తులోనే ఉంది.