Asianet News TeluguAsianet News Telugu

16 ఏళ్ల అమ్మాయిపై ఆరు నెలలుగా పదిమంది గ్యాంగ్ రేప్

మహారాష్ట్రలోని సోలాపూర్ లో ఓ పది మంది గత ఆరు నెలలుగా 16 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేస్తూ వస్తున్నారు. పది మందిలో ఐదుగురు ఆ అమ్మాయి స్నేహితులు. 

16-Yr-Old Dalit Girl molested by 10 in Maharashtra, Five Held
Author
Solapur, First Published Feb 12, 2020, 4:24 PM IST

షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ లో అత్యంత నీచమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 16 దళిత అమ్మాయిపై పది మంది దుర్మార్గులు ఆరు నెలల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బెదిరిస్తూ వివిధ ప్రదేశాలకు తరలిస్తూ ఆ దారుణానికి ఒడిగట్టారు.

గత మంగళవారంనాడు షోలాపూర్ లోని ఓ గుడి వద్ద ఏడుస్తున్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆ సంఘటన వెలుగు చూసింది. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. షోలాపూర్ కు చెందిన బాలిక తల్లితో కలిసి నివసిస్తోంది. తండ్రి కొద్ది రోజుల క్రితం మరణించాడు. 

బాధితురాలు చిన్న చిన్న పనులు చేస్తూ తల్లికి చేదోడుగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఐదుగురు యువకులతో పరిచయం ఏర్పడింది. ఆరు నెలల క్రితం బాలిక స్నేహితులు ఐదుగురు ఇంటికి వచ్ిచ మాయమాటలు చెప్పి నగరంలోని ఓ రహస్య ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత మరో ఐదుగురు యువకులు అక్కడికి వచ్చారు. 

ఆ పది మంది కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఆరు నెలలుగా వాళ్లు ఆమెపై వేర్వేరు ప్రాంతాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. 

ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో కొంత మంది ఆటో రిక్షా డ్రైవర్లు ఉన్నారు. దాంతో ఆటోల్లో ఆమెను వివిధ ప్రాంతాలకు తీసుకుని వెళ్తూ అత్యాచారం చేస్తూ వచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios