దారుణం: చెప్పుతో కొట్టిందని టెన్త్ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్, హత్య

16 year old student rape and  killed in Karnataka state
Highlights

కర్ణాటక రాష్ట్రంలోని  కోలార్ జిల్లా మాలూరు రైల్వేస్టేషన్ సమీపంలోని ఇందిరానగర్‌లో పదవతరగతి విద్యార్ధినిపై గ్యాంగ్‌రేప్ చోటు చేసుకోంది.  అంతేకాదు బాధితురాలిని నిందితులు హత్య చేశారు

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని  కోలార్ జిల్లా మాలూరు రైల్వేస్టేషన్ సమీపంలోని ఇందిరానగర్‌లో పదవతరగతి విద్యార్ధినిపై గ్యాంగ్‌రేప్ చోటు చేసుకోంది.  అంతేకాదు బాధితురాలిని నిందితులు హత్య చేశారు.  ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మాలూరులోని స్కూల్‌లో టెన్త్ చదువుతున్న విద్యార్థినిని  ఓ యువకుడు  ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. అయితే దీంతో  ఆమె రోడ్డుపైనే  ఆ యువకుడిని చెప్పుతో కొట్టింది. దీంతో నిందితుడు బాధితురాలిపై  కక్షకట్టాడు.

బాధితురాలిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు.   ప్రతి రోజూ మాదిరిగా స్కూల్ నుండి ఇంటికి వస్తున్న  బాధితురాలిని  నిందితుడు కిడ్నాప్ చేశారు.  రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి తన స్నేహితుల సహాయంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి స్నేహితులు కూడ బాధితురాలిపై అత్యాచారం చేశారు.

ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. రైల్వేస్టేషన్‌  సమీపంలోని బ్రిడ్జి కింద  మృతదేహన్ని వదిలేసి  పారిపోయారు.  ఇదిలా ఉంటే స్కూల్ కు వెళ్లిన కూతురి కోసం కుటుంబసభ్యులు  వెతికారు. అయితు రై్వేస్టేషన్ సమీపంలో బాధితురాలు మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలు  పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనతో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  నిందితులను నడిరోడ్డుపై ఉరి తీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

ఈ వార్త చదవండి:దారుణం: కారులో భర్త ఎదుటే భార్యపై గ్యాంగ్‌రేప్

 

loader