కోర్బా: చత్తీస్ గడ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన జరిగింది. అత్యాచార ఘటనలో పాలు పంచుకుని, రాళ్లూ కర్రలతో 16 ఏళ్ల అమ్మాయిని హత్య చేసిన ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఇరు కుటుంబాల వాళ్ల పాలు పంచుకున్నారు. 

ఆమె తండ్రిని, నాలుగేళ్ల మనవరాలిని, అమ్మాయిని రాళ్లూ కర్రలతో కొట్టి చంపి, శవాలను అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ సంఘటన చత్తీస్ గఢ్ లోని గధప్రొడా గ్రామంలో జనవరి 29వ తేదీన చోటు చేసుకుంది. మంగళవారం వెలుగులికి వచ్చింది. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు కోర్బో పోలీసు సూపరింటిండెంట్ అభిషేక్ మీనా చెప్పారు. 

నిందితులను శాంతారామ్ మఝ్వార్ (45), అబ్దుల్ జబ్బార్ (29), అనిల్ కుమార్ శర్తి (20), పర్దేశీ రామ్ పనిక (35), ఆనంద్ రామ్ పనిక (25) ఉమాశంకర్ యాదవ్ (21)లుగా గుర్తించారు. వీరంతా కోర్బా జిల్లాలోని సత్రెంగ గ్రామానికి చెందినవారు 

ప్రాథమిక సమాచారం మేరకు.... నిందితుడైన బాలిక తండ్రి ప్రధాన నిందితుడు మఝ్వార్ వద్ద నిరుడు జులై నుంచి పశువులను మేపే పని చేస్తూ వస్తున్నాడు. జనవరి 29వ తేదీన మఝ్వార్ మోటార్ సైకిల్ మీద ఆ వ్యక్తిని, కూతురిని, మనవరాలిని వాళ్ల గ్రామంలో దింపడానికి బయలుదేరాడు. మధ్యలో వారు కోరాయి గ్రామం వద్ద ఆగారు. మఝ్వార్ మద్యం సేవించాడు. ఇతర నిందితులు కూడా అతన్ని చేరుకున్నారు. 

నిందితుడు వారిని గధప్రొడా అటవీ ప్రాంతం వెంట తీసుకుని వెళ్లాడు. మఝ్వార్ తో పాటు ఇతర నిందితులు కూడా అమ్మాయిపై అత్యాచారం చేశారు. నిందితులు ఆ ముగ్గురిని చంపేసి శవాలను అడవిలో పడేశారు.  

వ్యక్తి కుమారుడు తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదని లెమ్రూ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుల విచారించిన పోలీసులు నేరం జరిగిన ప్రాంతానికి వెళ్లేసరికి గాయపడిన బాలిక జీవించి ఉండగా, మిగతా ఇద్దరు అప్పటికే మరణించారు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె మధ్యలోనే మృత్యువాత పడింది.