ప్రేమించిన వాడిని పెళ్లాడలనే ఆశతో వెళ్తున్న బాలిక పై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన అమృత్ సర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. లుథియానాకు చెందిన 15ఏళ్ల బాలిక  సాహిల్ యువకుడిని ప్రేమించింది. అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది.

ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పకుండా.. ప్రియుడిని పెళ్లాడేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ఢిల్లీ వెళ్లాల్సిన పొరపాటున వేరే బస్సు ఎక్కడంతో అమృతసర్ కి చేరుకుంది. అమృత్‌సర్ చేరుకున్న బాలికను సాహిబ్ సింగ్ అనే ఆటో డ్రైవర్ బోల్తా కొట్టించాడు. ఉదయం ఢిల్లీకి ట్రైన్ ఉందని, అప్పటి వరకు హోటల్‌లో ఉండమని చెప్పాడు. హోటల్‌లో దిగిన బాలికపై తన స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడు. అనంతరం విషయం బయటికి చెప్పవద్దని బాలికను చితక్కొట్టి లుధియానాకు బస్సెక్కించాడు.

 లుథియానా చేరుకున్న బాలిక.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది.  బాలిక ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సాహిబ్ సింగ్, బాబాలుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.