Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో దారుణం.. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం..

ఢిల్లీలో మైనర్ ను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఈ  ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు మైనర్ ఉన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

13-year-old girl kidnapped, gang-raped in Delh
Author
Delhi, First Published May 19, 2022, 8:45 AM IST

ఢిల్లీలో దారుణం జ‌రిగింది. ఓ మైనర్ బాలికను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇందులో ఒక మైన‌ర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ఢిల్లీలోని తన ఇంటి ఆ బాలిక త‌ప్పిపోవ‌డంతో ఆమెను దుండ‌గ‌లు కిడ్నాప్ చేశారు. అనంత‌రం రేప్ చేసి తిరిగి అదే ప్రాంతంలో వ‌దిలిపెట్టారు

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 24వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో ఆ బాలిక తన ఇంటి నుంచి కూరగాయ‌లు కొనేందుకు బయటకు వెళ్లింది. తన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిబజార్‌లో ఆటో ఎక్కింది. అయితే ఆ ఆటో డ్రైవ‌ర్ షారుక్ ఆమెను మార్కెట్ లో దించ‌లేదు. పైగా తన ఇద్దరు స్నేహితులైన ఆకాష్, జువెనైల్‌ని పిలిచి ఆటో ఎక్కించుకున్నాడు.ఆ ఆటోను ఓఖ్లాకు తీసుకెళ్లాడు. అక్క‌డే ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి ఆటోలోనే బ‌ల‌వంతంగా తాగించారు. 

నా భార్య, సొంత కొడుకునే పెళ్లాడింది... డబ్బులతో పరారయ్యింది.. పోలీసులకు భర్త ఫిర్యాదు..

అనంతరం ఆమెను టిగ్రీలోని జెజె క్యాంప్‌కు తీసుకెళ్లారు. అక్కడ మరో మైన‌ర్ అబ్బాయిని పిలింపించారు. అక్క‌డే న‌లుగురు ఆమెను బ‌ల‌వంతంగా అత్యాచారం చేశారు. వారు రాత్రంతా అక్క‌డే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం వారు న‌లుగురు ఆ మైనర్ ను మధురలోని కోసి కలాన్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ వారు ఆమెను ఒక రోజు ఉంచారు. త‌రువాత‌ది రోజు ఆమెను తిరిగి ఢిల్లీకి తీసుకువచ్చి టిగ్రీ ప్రాంతంలో పడేశారు. 

Monsoon 2022: నైరుతి రుతుప‌వ‌నాల ఆగ‌మ‌నం.. రాష్ట్రప్ర‌భుత్వాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన కేంద్రం

ఆలోపే తమ కూతురు త‌ప్పిపోయింద‌ని త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఏప్రిల్ 26వ తేదీన కిడ్నాప్ కేసు న‌మోదు చేశారు. అయితే నిందితులు విడిచి పెట్టిన త‌రువాత బాలిక సాకేత్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. అక్క‌డ ఆ బాలిక ప‌రిస్థితిని గ‌మ‌నించి పోలీసులు ఏం జ‌రిగింద‌ని ఆరా తీశారు. ఆ స‌మ‌యంలో ఆమె ఇంకా మ‌త్తులోనే ఉంది. దీంతో పోలీసులు ఆ మైన‌ర్ ను ఎయిమ్స్‌లో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. బాలిక‌పై లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారించారు.

Assam Floods: అస్సాంలో వ‌ర‌ద బీభ‌త్సం.. 9 మంది మృతి.. 6 లక్షల మందిపై ప్ర‌భావం

బాధితురాలు, ఆమె త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. మొద‌టి నిందితుడిని మే 1వ తేదీన పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన ముగ్గురు నిందితులను మోహిత్ (20), ఆకాష్ (19), షారుక్ (20)గా పోలీసులు గుర్తించారు. ఇందులో బాల నేరస్థుడితో పాటు నిందితులంద‌రిపై కిడ్నాప్, మైనర్‌పై సామూహిక అత్యాచారం, అక్రమ నిర్బంధంలో ఉంచడం, నేరపూరిత కుట్ర మరియు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. కేసులో విచార‌ణ జ‌రుగుతోంద‌ని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios