ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల ముందే 12 ఏళ్ల బాలికపై దుండగులు అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళితే.. కుశీనగర్ జిల్లా అహిరౌలీ బజార్‌కు చెందిన ఒక కుటుంబానికి కొందరితో ఒక కాలువ నిర్మాణానికి సంబంధించిన వివాదం ఉంది.

గత కొంతకాలంగా ఈ విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఆరుగురు వ్యక్తులు వారి ఇంట్లోకి చొరబడి బాలికను బయటకు లాక్కొచ్చి ఆమెను వివస్త్రను చేశారు.

అడ్డుకోబోయిన తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టారు. అనంతరం వారి కళ్ల ముందే బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై బాధితురాలి తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను వీరు యాదవ్, జైవీర్ ప్రసాద్, చందన్ ప్రసాద్, గౌతమ్ ప్రసాద్, నితీశ్ కుమార్, ముఖ్తార్ ప్రసాద్‌గా గుర్తించారు. వీరిలో నలుగురిని అదుపులోకి తీసుకుని వీరిపై ఐపీసీ సెక్షన్ 376, 323, 147, 504, 506, 452తో పాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నితీశ్ కుమార్, ముఖ్తార్ ప్రసాద్‌ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.