ముంబై: పదేళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న వైనం మహారాష్ట్రంలోని పాల్ఘర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పదే పదే అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని పోలీసులు శనివారంనాడు వెల్లడించారు. 

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు 12 ఏళ్ల బాలుడిపై కేసు నమోదు చేశారు. బాలిక, బాలుడు పక్కపక్క ఇళ్లలోనే ఉంటారు. గత నాలుగు నెలలుగా బాలికపై బాలుడు అత్యాచారం చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. 

కడుపు నొప్పి అంటూ కొద్ది రోజుల క్రితం బాలిక చెప్పడంతో సంఘటన వెలుగు చూసింది. బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. 

దాంతో ఏం జరిగిందనే విషయాన్ని తల్లిదండ్రులు కూతురు నుంచి రాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు బాలుడిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.