జర్నలిస్ట్ బుఖారీ హత్య, ముగ్గురి ఊహచిత్రాల విడుదల

‘Rising Kashmir’ editor Shujaat Bukhari shot dead; police say initial probe indicates terror attack
Highlights

రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ బుఖారీ మర్డర్


శ్రీనగర్: రైజింగ్ కాశ్మీర్  పత్రిక ఎడిటర్ బుఖారీని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్తత నెలకొంది. బుఖారీని హత్య చేసిన నిందితుల ఊహచిత్రాలను పోలీసులు విడుదల చేశారు.

48 ఏళ్ళ బుఖారీ  రైజింగ్ కాశ్మీర పత్రికకు ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. ఈ పత్రిక జమ్మూలో చాలా ప్రసిద్ది చెందింది. బుఖారీతో పాటు ఆయన ఇద్దరు గన్‌మెన్లను కూడ దుండగులు కాల్చిచంపేశారు. మోటార్ సైకిల్ పై వచ్చిన ముగ్గురు నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని  పోలీసులు చెబుతున్నారు.

బుఖారీని టెర్రరిస్టులు హత్య చేసి ఉంటారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ విషయమై ఆయన జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబుబా ముఫ్తీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితుల ఫొటోలను గురువారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. 

సీసీటీవీ పుటేజీ ఆధారంగా మాస్కులు ధరించి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల కదలికలను గుర్తించామని పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం ఇఫ్తార్‌ విందుకు వెళ్లేందుకు బుఖారి శ్రీనగర్‌లోని తన ఆఫీస్‌ నుంచి బయటకు రాగానే దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. 
 

loader