Asianet News TeluguAsianet News Telugu

రూ.10లక్షలు ఇస్తావా.. రేప్ చేశావని చెప్పమంటావా..?

రూ.పదిలక్షలు ఇస్తావా.. లేదా నన్ను రేప్ చేశావంటూ కేసు పెట్టమంటావా..? అంటూ ఓ యువతికి ఓ వ్యక్తిని బెదిరించింది.

"Pay 10 Lakh Or Face Rape Charge": Noida Woman Arrested Over Blackmail
Author
Hyderabad, First Published Nov 6, 2018, 10:01 AM IST


రూ.పదిలక్షలు ఇస్తావా.. లేదా నన్ను రేప్ చేశావంటూ కేసు పెట్టమంటావా..? అంటూ ఓ యువతికి ఓ వ్యక్తిని బెదిరించింది. చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నోయిడాలోని లక్కనవాలి ప్రాంతానికి చెందిన యువతి.. అదే ప్రాంతానికి చెందిన యువకుడితో గత కొంతకాలంగా పరిచయం ఉంది. కాగా.. సదరు యువతి.. పలు సందర్భాల్లో డబ్బు అవసరం ఉంటూ.. యువకుడి దగ్గర అప్పుగా డబ్బు తీసుకుంది. వాటిని తిరిగి ఇవ్వకపోగా.. తాజాగా రూ.10లక్షలు డబ్బు ఇవ్వాలని కోరింది. 

అంత నగదు తన దగ్గర లేదని యువకుడు చెప్పగా.. రూ.పదిలక్షలు ఇవ్వకుంటే తనను రేప్ చేశావని అబద్ధపు కంప్లెయింట్ పెడతానని బెదిరించింది. దీంతో బెదిరిపోయిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. సదరు యువతి చేసిన ఫోన్ మెసేజీలను కూడా యువకుడు పోలీసులకు చూపించాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని సోమవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios