ముంబై: ముంబైలో ఉగ్ర దాడిలో కీలక పాత్ర పోషించిన తీవ్రవాది కసబ్  చేతికి ఉన్న ఎర్ర దారానికి సంబంధించి ఆసక్తికర విషయాలను మాజీ ముంబై పోలీసు కమిషన్ రాకేష్ మరియా వెల్లడించారు.

మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్  12 ఏళ్ల క్రితం ముంబైలో భీకరమైన దాడుల్లో కీలక పాత్రధారి.  ఈ దాడులకు పాకిస్తాన్ కీలకంగా వ్యవహరించిందని భారత్ ఆరోపించింది. ఈ దాడుల్లో  పాక్ నుండి వచ్చిన ఉగ్రవాదుల్లో  కసబ్‌ను పోలీసులు  అరెస్ట్ చేశారు. 

12 ఏళ్ల క్రితం ముంబైలో ముంబైలో కరుడుగట్టిన కసబ్  విచక్షణ రహితంగా కాల్పులకు దిగాడు. పాకిస్తాన్ కు చెందన కసబ్ తన కుడిచేయికి ఎర్రదారం కట్టుకొన్నాడు. కసబ్ ను హిందూ ఉగ్రవాదిగా చూపించేందుకు ఒక దశలో ప్రయత్నాలు జరిగాయని ముంబై మాజీ పోలీస్ కమిషన్ రాకేష్ మరియా చెప్పారు. లెట్‌ మీ సే ఇట్ నౌ పేరుతో రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.

ముంబై పేలుళ్ల తర్వాత కసబ్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో భుజాన బ్యాగ్‌తో తుపాకీ పట్టుకొని కసబ్ వెళ్తున్న ఫోటో ఉంది. కసబ్ చేతికి ఎర్రదారం కట్టుకొని ఉన్నాడు.  ఈ ఘటనకు హిందూ ఉగ్రవాదులు కారణమని చూపించేందుకు లష్కరే తోయిబా ప్రయత్నం చేశారని  ఆయన అభిప్రాయపడ్డారు.  

కసబ్ పేరును సమీర్ చౌధరీ అని బెంగుళూర్ వాసి రాసి ఉంది.  ఈ ఎర్రదారం చూసి హిందు ఉగ్రవాదుల దాడి అని అందరూ భావించేవారని లష్కరే తోయిబా భావించిందన్నారు. 

ముంబై పేలుళ్ల తర్వాత  కసబ్ సజీవంగా దొరకడంతో అసలు విషయాలు వెలుగు చూసినట్టుగా ఆయన చెప్పారు.  కసబ్ ను మట్టుబెట్టేందుకు దావూద్ ముఠా ద్వారా లష్కరే తోయిబా ప్రయత్నాలు చేసిందని ఆయన ఆ పుస్తకంలో  ఆయన వివరించారు.2012 లో కసబ్ ను దోషిగా ముంబై కోర్టు తేల్చింది. అంతేకాదు ఆయనకు ఉరిశిక్షను విధించింది.  2012 నవంబర్ 21న యరవాడ జైలులో కసబ్‌ను ఉరి తీశారు.