తనను ఇంట్లో ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదని అయినవాళ్లపైనే పగ పెంచుకుంది. తనలో తానే లేనిపోనివన్నీ ఊహించుకొని చివరకు సొంత అన్న, మేనకోడలి ప్రాణాలు తీసింది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ కి చెందిన కిన్నరీ పటేల్(28) డెంటిస్ట్ గా విధులు నిర్వర్తిస్తోంది. కాగా.. ఆమెకు జిగర్ పటేల్(32) అనే సోదరుడు ఉన్నాడు. అతనికి వివాహం జరిగి 14 నెలల కుమార్తె కూడా ఉంది. తనను ఇంట్లో ఎవరూ పట్టించుకోరని కిన్నరీ కుటుంబసభ్యులపై పగ పెంచుకుంది. ఈ క్రమంలోనే ఆరు నెలలుగా తన సోదరుడు, మేనకోడులు తాగే వాటర్ లో స్లో పాయిజన్ కలిసి.. అది వారి శరీరంలోకి వెళ్లేలా చేసింది.

స్లో పాయిజన్ కారణంగా గత నెల 5వ తేదీన జిగర్ ఉన్నపలంగా ఇంట్లో కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అతని నోట్లో కిన్నరీ సైనేడ్ పెట్టింది. దీంతో.. జిగర్ ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదం నుంచి తేరుకునేలోపే మరో విషాదం చోటుచేసుకుంది.

జిగర్ 14నెలల కుమార్తె కూడా గత నెల30వ తేదీన ఉన్నట్లుండి కుప్పకూలి పోయింది. ఆ పాప నోట్లు కూడా కిన్నర్ సైనెడ్ పెట్టడం గమనార్హం. దీంతో చిన్నారి కూడా కన్నుమూసింది. అయితే.. ఇంట్లో జరిగిన రెండు విషాదాలకు కుటుంబం మొత్తం తీరని బాధలో కూరుకుపోతే...కిన్నరీ మాత్రం సాధారణంగా వ్యవహరించడం విశేషం.

తోడబుట్టిన అన్న, ముద్దులొలికే మేనకోడలు చనిపోతే కనీసం కిన్నరీ బాధపడకపోవడం కుటుంబసభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే దీనిపై కిన్నరీని నిలదీయగా.. తానే స్లోపాయిజన్ ఇచ్చి చంపినట్లు తేల్చిచెప్పింది. దీంతో... ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డెంటిస్ట్ కిన్నరీని అరెస్టు చేశారు.