‘మీ గంజాయి పోయిందా..? అది మా దగ్గరే ఉంది. గత రాత్రి టక్కుతో సహా మాకు దొరికింది. అది మీదే అని నిరూపించుకొని.. వాటిని తీసుకొని వెళ్లండి’ అంటూ పోలీసులు సోషల్ మీడియా వెబ్ సైట్ లో పోస్టు చేశారు. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా... అక్కడి పోలీసులు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పోలీసులు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో... కొందరు స్మగ్లర్లు గంజాయిని ట్రక్కులో తరలిస్తున్నారు. పోలీసులను చూసి ట్రక్కుని అక్కడే వదిలేసి పారిపోయారు. ఆ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

‘ఎవరిదైనా భారీ మొత్తంలో (590 కేజీల) గంజాయి పోయిందా? అయితే బాధపడకండి.. అది గత రాత్రి ట్రక్కుతో సహా మాకే దొరికింది. మీదైతే మాత్రం ధుబ్రి పోలీసులకు టచ్‌లో ఉండండి. వారు పక్కా మీకు సహాయం చేస్తారు.’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. పోలీసులు ట్వీట్‌ చేసిన ఫొటోలో గంజాయి ప్యాక్‌ చేసిన 50 కాటన్లున్నాయి. దుండగులు చగోలియా చెక్‌పాయింట్‌లో ఈ బాక్సులను ట్రక్కుతో వదిలివెళ్లారు.