ఇంటి నిర్మాణంలో పైకప్పుకు విశిష్ట స్థానం ఉంది. ఎండ, వాన, చలి వంటి ఇతర అంశాల నుంచి భవనాలను రక్షించడానికి పైకప్పులు సహాయపడతాయి. ఆకారం, స్ధానం, వాతావరణం రూఫింగ్‌కు వినియోగించిన పదార్ధాలు పైకప్పుకు ముఖ్యం.

గతంలో తారు రేకులు ఇంటి నిర్మాణంలో ఎక్కువగా వాడేవారు. ఎందుకంటే అవి చవకగా దొరకడంతో పాటు ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి. అయితే కాంక్రీట్‌తో  ప్లాస్టింగ్ చేసిన సాఫ్ట్ రూఫ్‌లను ఎక్కువగా వాణిజ్య భవనాల నిర్మాణంలో ఉపయోగిస్తారు.

ప్రస్తుతం మెటల్, ఈపీడీఎం, అంతర్నిర్మిత పైకప్పులు ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఇంటికి రక్షణను అందించే పైకప్పులలో వివిధ రకాలైన పదార్ధాలను కలిగి ఉండటం మంచిదేనని నిపుణులు అంటున్నారు. 

ప్రస్తుతం అనేక రకాల పైకప్పులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్క రకమైన ప్రయోజనం ఉంది. అందుబాటులో ఉన్న అత్యంత సాధారణ రూఫింగ్ పదార్ధాలలో తారు, కలప, లోహం, మట్టి, సిమెంట్, గాజు, ప్లాస్టిక్ ఉన్నాయి. 

తారు, బొగ్గులతో తయారు చేసిన అంతర్నిర్మిత రూఫింగ్‌లలో ఉపయోగించే బిటుమినస్ పదార్ధాలు రెండూ సాధారణ ఉష్ణోగ్రత వద్ద ధృడంగా ఉంటాయి. వాలుగా ఉండే పైకప్పులకు ఫ్లాట్ రూఫ్ కోసం బొగ్గు తారుతో ఉన్న రేకులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. 

మెటల్ పైకప్పులను సాధారణంగా ఫ్లాట్ పైకప్పుల కోసం ఉపయోగిస్తారు, కానీ 3:12 లేదా అంతకంటే ఎక్కువ వ్యాసార్ధం ఉన్న పైకప్పులకు కూడా ఇవి నప్పుతాయి. చదునుగా ఉండే పైకప్పులలో వీటిని ఉపయోగించడానికి కరిగించడమో లేదంటే వెల్డింగ్ చేయడమో చేయాలి.

అదే పెంకులతో వేసే పైకప్పులపై అయితే ఒకే లోహానికి చెందిన స్క్రూలతో అటాచ్ చేస్తారు. మెటల్ రూఫింగ్ పదార్థాలలో గాల్వనైజ్డ్ ఇనుము, రాగి, అల్యూమినియం, టెర్నే ప్లేట్ (సీసం, టిన్‌తో పూసిన ఉక్కు) ఉపయోగిస్తారు. సీసం, జింక్, స్టెయిన్‌లెస్ స్టీల్‌ కూడా ఉపయోగిస్తారు కానీ ఇది అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే కొందరు ఈ విధానానాన్ని ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మనదేశంలో ఇది అంత సులభం కాదు. 

ఇక చెక్క పెంకుల విషయానికి వస్తే ఎర్ర దేవదారు, సైప్రస్, రెడ్‌వుడ్ వంటి క్షయం కానీ కలప జాతుల నుంచి తయారు చేస్తారు. ఇవి వివిధ రకాల గ్రేడ్‌లలో లభిస్తున్నాయి. వీటిని మెషిన్, లేదా చేతితో తయారు చేస్తారు. 

కలప పెంకులు పైకప్పులకు, గోడలకు రెండింటికి వాడతారు. వీటిని ఒక ప్రణాళిక ప్రకారం గాల్వనైజ్డ్ స్క్రూలతో అతికిస్తారు. కలపతో చేసిన పెంకులు పైకప్పు పై భాగంలో ఉపయోగించడం అరుదు. అయితే కొందరు దీనిని గోడలపై, కాంక్రీట్ రూఫింగ్ కింద వేడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. 

మట్టితో చేసిన పెంకులు, టైల్స్ భూమి రంగులో, నిర్దేశిత నమూనాలతో లభిస్తాయి. వీటిని ఇటుకలు తయారు చేసే పద్ధతిలోనే రూపొందిస్తారు. సిమెంట్ రూఫింగ్ పలకలను పోర్ట్‌ల్యాండ్ సిమెంట్, కంకర నుంచి తయారు చేస్తారు. ఇవి బంకమట్టి పలకల కన్నా తక్కువ ఖరీదైనవి.

స్లేట్ రూఫింగ్ టైల్స్ లేదా పెంకులను సహజ శిలల నుంచి త్రవ్వి, సన్నని దీర్ఘ చతురస్రాకార స్లాబులుగా విభజిస్తారు. వీటి సగటు పరిమాణం 12 అంగుళాల నుంచి 16 అంగుళాల వరకు ఉంటాయి. టైల్ పైకప్పులు చాలా మన్నికైనవి, అగ్ని నిరోధకమైనవి. వీటి నాణ్యత కారణంగా ధర అధికంగా ఉంటుంది. ఇవి ఎల్లప్పుడూ వాలుగా ఉన్న పైకప్పులకు మాత్రమే సరిపోతాయి. 

ప్రస్తుతం ఇంటి నిర్మాణంలో మారుతున్న అభిరుచుల కారణంగా గ్లాస్, ప్లాస్టిక్ షీట్లు, స్కైలైట్లను పైకప్పులుగా ఉపయోగిస్తున్నారు. వీటిని ఎక్కువగా పారిశ్రామ నిర్మాణాలు, గ్రీన్‌హౌస్‌లలో విరివిగా వాడుతున్నారు.

ప్లాస్టిక్, గాజు రెండూ తక్కువ అగ్ని నిరోధకతను కలిగి ఉంటాయి. అందువల్ల వైర్ రీన్‌ఫోర్డ్ గ్లాస్, ఫైబర్ గ్లాస్ రీన్‌ఫోర్డ్, యాక్రిలిక్ షీట్లను సాధారణంగా ఉపయోగిస్తున్నారు. స్కైలైట్లు గోపురం, ఫ్లాట్, వంపు, పిరమిడ్ సహా తదితర ఆకారాలలో లభిస్తున్నాయి. లైటింగ్‌ను నిర్థారించడానికి అందాన్ని పెంచడానికి ఇది తరచుగా రూఫింగ్ పద్ధతులతో పాటు ఉపయోగించబడుతుంది.