ఇంటికి పైకప్పు వేయాలని అనుకుంటున్న వారు నిపుణులను సంప్రదించడం మంచిది. ఈ సందర్భంగా వారు పాత రూఫింగ్‌ విధానాలను కాకుండా పరిస్ధితులకు తగ్గ మెటీరియల్‌ను ఎంచుకోవాల్సిందిగా సూచిస్తారు. ఎందుకంటే ప్రతి రూఫింగ్ మెటీరియల్ మరోదానితో సమానంగా ఉండదు.

ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాజెక్టులకు అన్ని నప్పవు.. అందువల్ల వేరే వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. రూఫీంగ్ షీట్ల గురించి ఒకసారి పరిశీలిస్తే.. పైకప్పు పొందే గరిష్ట రక్షణ స్థాయిని బట్టి రూఫింగ్ కవర్ల ఎంపిక ఆధారపడి ఉంటుంది.

ఇంటి పైకప్పుపై గ్యారేజ్, షెడ్, మరో భవనం ఉన్నట్లయితే పైకప్పును కఠినమైన వాతావరణం నుంచి రక్షించడానికి రూఫింగ్ షీట్లు ఉపయోగపడతాయి. ఇందుకు పరిగణించవలసిన నాలుగు సాధారణ రూఫింగ్ షీట్లు ఇవే. 

మెటల్ రూఫ్ షీట్లు:
గార్డెన్ బిల్డింగ్‌పైన లేదంటే మీ గ్యారేజ్‌ను అందంగా అలంకరించడంతో పాటు గౌరవం, ఆనందాన్ని కాపాడటం కోసం మెటల్ రూఫ్ షీట్లు అద్భుతమైన ఎంపిక. అన్ని వాతావరణ పరిస్ధితులకు సరిపోవడంతో పాటు ఇవి చాలా మన్నికైనవి. ఈ రూఫింగ్ షీట్లు మిగిలిన వాటితో పోలిస్తే తేలికనైవి, ఖర్చు కూడా తక్కువ.

అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవవడంతో పాటు అదనంగా పాలిస్టర్ లేదా ప్లాస్టిక్ పూత వేసినప్పుడు కింద వున్న లోహానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. భవనానికి తగ్గట్టుగా అనేక రకాల రంగులలో ఇవి లభిస్తాయి. పైకప్పు లైట్ ప్యానెల్స్‌తో వీటిని అనుసంధానించినప్పుడు గాజు కిటికీలపై అదనపు బరువు లేకుండా కాంతిని ధారాళంగా ఇస్తుంది. 

ప్లాస్టిక్ రూఫ్ షీట్లు :
ప్లాస్టిక్ రూఫ్ షీట్లు గార్డెన్, తాత్కాలిక భవనాలు వంటి చిన్న చిన్న నిర్మాణాలకు సరిగ్గా సరిపోతాయి. ఒకవేళ మీరు ఈ రెండు రకాల నిర్మాణాలను ఒకే చోట చేస్తుంటే ప్లాస్టిల్ మీకు సరైన ఎంపిక. అదే సమయంలో పైకప్పుపై ఒత్తిడిని కలిగించే కారకాలను పరిగణనలోనికి తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీరు ఎంచుకోబోయే ప్లాస్టిక్ రూఫ్ రకాన్ని నిర్ణయిస్తుంది.

మీరు గనుక పైకప్పుపై తక్కువ బరువు ఉండాలని భావిస్తున్నట్లయితే తేలికపాటి ప్లాస్టిక్ రూఫింగ్ షీట్లు ఉత్తమమైనవి. మన్నికను పెంచేందుకు గాను బలమైన ప్లాస్టిక్‌లను ఉపయోగించాలి.. అయితే ఇది ఖర్చు పెంచుతుందన్న సంగతిని గమనించాలి. ఇదే సమయంలో అదనపు ప్లాస్టిక్ షీట్ పైకప్పులను పాలికార్బోనేట్ లేదా మెటల్ రూపింగ్ షీట్లతో పోల్చలేం. 

పాలికార్బోనేట్ రూఫింగ్ షీట్లు
మీ ఇంటి ఆవరణలో కార్ పార్కింగ్ షెడ్డు లేదా పెంపుడు జంతువులు నివసించడానికి చిన్నపాటి షెడ్డు నిర్మించాలని అనుకుంటున్నారా అప్పుడు మీకు పాలికార్బోనేట్ పైకప్పులు ఉపయోగపడతాయి. పక్షిశాల, గ్యారేజ్, పార్కింగ్ షెడ్డు ఇలాంటి వాటి కోసం పాలికార్బోనేట్ రూఫింగ్ షీట్లు మంచి పనితీరును అందిస్తాయి.

అధిక ప్రభావ పాలిప్రొఫైలిన్ రెసిన్‌ను ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. అంతేకాకుండా ఇవి తేలికనైనవి, మన్నికైనవి.. సులభంగా కత్తిరించవచ్చు. నూనెలు, నీరు, ద్రావకాలు, కఠినమైన రసాయనాల నుంచి అధిక నిరోధకతను కలిగి ఉంటుంది అందువల్ల ఈ తరహా రూఫింగ్ షీట్లు కఠినమైన వాతావరణానికి కూడా ఎదురొడ్డి నిలబడతాయి.

పాలికార్బోనేట్ షీట్లను యూవీ ప్రొటెక్షన్, ఫ్లేమ్ రిటార్డెంట్స్, యాంటీ స్టాటిక్ డిసిపేటివ్, కలర్ ఆప్షన్ వంటి ప్రత్యేకమైన ఫినిషింగ్‌లతో మరింత మెరుగుపరచవచ్చు. దీనికి అదనంగా పాలికార్బోనేట్ పైకప్పు షీట్ల లేయర్డ్ డిజైన్ డబుల్ గ్లేజింగ్ మాదిరిగానే పనిచేస్తుంది. ఈ స్పష్టమైన రూపకల్పన ద్వారా ఇది అంతర్గతంగా వేడిని మరింత సమర్థవంతగా నిరోధించగలదు. 

ముడతలు పెట్టిన రూఫింగ్ షీట్లు
చివరగా.. ముడతలు పెట్టిన పైకప్పు పలకల సంగతి చూస్తే, వీటిని వ్యవసాయ భవనాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ తరహా షీట్లు చాలా ఏళ్ల పాటు నమ్మకమైన ఉపయోగాన్ని అందిస్తాయని చాలామందికి విశ్వాసం.

వాస్తవానికి, ఈ రకమైన షీట్లను పీవీసీ ప్లాస్టిసోల్‌తో తయారు చేస్తారు. దీని వల్లే ముడతలు పెట్టిన రూఫింగ్ షీట్లు ఎక్కువ కాలం మన్నడంతో పాటు సులభంగా గీతలు పడవని నిపుణులు చెబుతున్నారు.

ఇక నిర్వహణ విషయానికి వస్తే.. వీటిని ఒకసారి ఉపయోగించిన తర్వాత 5 నుంచి 10 సంవత్సరాలకు మాత్రమే మళ్లీ మార్చుకోవాల్సి వుంటుంది. వీటిపై గీతలు పడితే వాటిని కనిపించకుండా చేయడానికి టచ్ అప్ పెయింట్స్ అందుబాటులో ఉన్నాయి.