‘ఒరేయ్ బామ్మర్ది’ రివ్యూ
హీరో సిద్ధార్థ్ నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’ ఈరోజు ఈమూవీ థియేటర్లలో విడుదలైంది. తమిళంలో విజయవంతమైన ‘సివప్పు మంజల్ పచ్చై’ చిత్రానికి తెలుగు అనువాదమిది. ఈరోజు ఈమూవీ థియేటర్లలో విడుదలైంది.
ఒకప్పుడు లవర్ బోయ్ గా వెలిగిన సిద్దార్ద..ఈ మధ్యకాలంలో సక్సెస్ కు దూరం అయ్యారు. సినిమాలు చేస్తున్నా వర్కవుట్ కావటం లేదు. ఈ నేపధ్యంలో ఆయన ‘సివప్పు మంజల్ పచ్చై’ అనే తమిళ చిత్రం చేసారు. ‘బిచ్చగాడు’దర్శకుడు శశి చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో సంగీత దర్శకుడు మరియు, నటుడు అయిన జి.వి.ప్రకాష్ మరో హీరోగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటంతో ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ రెట్టింపయ్యాయి. వాటిని ఆ సినిమా ఏ మేరకు అందుకుందో చూద్దాం..
కథ
మదన్(జీవీ ప్రకాశ్‌కుమార్) కు రాజ శేఖర్ అలియాస్ రాజ్(సిద్దార్థ్) అంటే పడదు. అందుకు కారణం సిన్సియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అయిన రాజ్ ఓ సారి రోడ్డుపై బైక్ రేసింగ్ చేస్తూ దొరికిపోతాడు. దాంతో రాజ్ కాస్త ఎక్కువగానే రియాక్ట్ అవుతాడు. అందరి ఎదురుగా నైటి వేయించి అవమానిస్తాడు. దాంతో పగ పెంచుకుని టైమ్ కోసం ఎదురుచూస్తూంటాడు. అయితే ఊహించని విధంగా అదే రాజ్ తన జీవితంలోకి వస్తాడని మదన్ ఊహించడు. మదన్ అక్క రాజీ (లిజోమోల్ జోస్) ని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు రాజ్. దాంతో తన అక్కనీదూరం పెట్టేస్తాడు. ఆ తర్వాత ఆ బావ,బావమరదులు ఒకటవ్వాల్సిన సమయం వస్తుంది. చివరకు తను అంటేనే కోపంగా చూసే మదన్‌తో రాజ్ ‘బావ’ఎలా అని పిలిపించుకున్నాడు? అనేదే మిగతా కథ
ఎనాలసిస్...
‘బిచ్చగాడు’తో తల్లి సెంటిమెంట్ ని చాలా ఇంట్రస్టింగ్ గా నడిపిన దర్శకుడు శశి ఈ సినిమాలో తడబడ్డాడనే చెప్పాలి. బావ,బావమరది ఎమోషన్ డీల్ చేసే క్రమంలో ఎమోషన్ కన్నా యాక్షన్ డామినేట్ చేసింది. దానికి తోడు కథ మొత్తం సాధారణ ప్రేక్షకుడు ఊహించగలిగేలా ఉంది. బావమరిది సమస్య వస్తే బావ రంగంలోకి దిగటం...కూడా రొటీన్ గానే అనిపిస్తుంది.రేసుగుర్రం లాంటి ఓ అన్నదమ్ముల కథ బావ,బావమరదుల కథగా మార్చి చేసారనిపిస్తుంది. ఇవన్ని ప్రక్కన పెడితే...మదన్,కవిన్ ల మధ్య లవ్ ట్రాక్ ఒకటి చాలా ఇబ్బందిగా కథలో ఇమడదు. అలాగని ఇద్దరు హీరోలను పెట్టుకున్నప్పుడు వాళ్లకీ హీరోయిన్ పెట్టాల్సిందే..పాటలు పెట్టాల్సిందే తప్పని సరి పరిస్దితి. అయితే ప్రేక్షకుడుకు చూడాల్సిన అవసరం ఏముంటుంది. అయితే డైరక్టర్ తనకు ఉన్న అనుభవంతో ఇలాంటి పరమ రొటీన్ ట్రాక్ కథను కూడా ఇంట్రస్టింగ్ గా నడిపే ప్రయత్నం చేసారు. ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్స్,సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ఖచ్చితంగా ఇంట్రస్టింగా గా అనిపిస్తాయి. అయితే సెకండాఫ్ మరింత ఇంట్రస్టింగ్ గా నడిపితే బాగుండేది అనిపిస్తుంది. అవన్నీ సరిపోనట్లు యాక్షన్ సీక్వెన్స్ లు కోసం డ్రగ్ డీలర్ కేసు, చైన్ స్నాచింగ్ కేసు వంటివి కలిపేసారు. దాంతో సెకండాఫ్ పూర్తిగా పులిహారగా మారిపోయింది.ఉన్నంతలో ప్రీక్లైమాక్స్‌లో వచ్చే రాజ్.. మదన్‌ల మధ్య రేసింగ్ ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ మళ్లీ రొటీనే.
టెక్నికల్ గా...
ఇలాంటి సినిమాకు కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. పాటలు పెద్ద గొప్పగా లేవు . అలాగే ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫి సినిమాని ఓ స్దాయిలో నిలబెట్టింది. ఎడిటర్ సాన్ లోకేష్ మరింత షార్ప్ గా చెయ్యాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో నిజాయతీ గల ట్రాఫిక్ పోలీస్‌గా రాజశేఖర్ పాత్రలో సిద్ధార్థ్ నటించాడు కానీ పోలీస్ గా సిద్దార్ద్ ని చూడటం కష్టమే అనిపించింది. బైక్ రేస్‌లంటే ఇంట్రస్ట్ చూపించే కుర్రాడుగా జి.వి.ప్రకాష్ మెప్పించాడు. తన ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్స్ లిజోమోల్ జోస్, కశ్మీర్ పరదేశిలతో పాటు మిగిలిన ప్రధాన పాత్రధారులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.సిద్ధార్థ్ - ప్రకాష్‌ల మధ్య వచ్చే వార్ ఎపిసోడ్స్.. ప్రకాష్ రేసింగ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఫైనల్ థాట్
ఇమేజ్ అనేది ఆర్టిస్ట్ కు ఎంత ప్రతిబంధకమో ఈ సినిమాలో సిద్దార్ద పడిన కష్టం వృధా అవుతూంటే అర్దమవుతుంది.
Rating:2
ఎవరెవరు..
నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్;
నటీనటులు: సిద్ధార్థ్, జీవీ ప్రకాష్, లిజోమల్ జోస్, కశ్మీర, మధుసూధనన్, దీప రామానుజమ్, ప్రేమ్ తదితరులు;
నిర్మాత: ఎ.ఎన్.బాలాజీ;
సంగీతం: సిద్ధు కుమార్;
ఛాయాగ్రహణం: ప్రసన్న ఎస్.కుమార్;
దర్శకుడు: శశి;
విడుదల తేదీ: 13-08-2021