మోహన్ లాల్ 'మరక్కార్' రివ్యూ

మరక్కార్ సినిమా మీద మళయాలంలోనే కాకుండా తెలుగులో మంచి బజ్ ఏర్పడింది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్‌కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే.  

Mohanlal Marakkar-Arabian sea movie review

ప్రతీ ప్రాతంలో,  సంస్కృతిలో కొన్ని కథలు,గుర్తులు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ గుర్తు చేసే భాధ్యతను కళాకారులు తీసుకుంటారు. గత కొన్నేళ్లుగా సినిమా వాళ్లు ఆ భాధ్యతను నెరవేరుస్తున్నారు.  ఆ క్రమంలో ఎన్నో చారిత్రక చిత్రాలు కొంత కాల్పనిక కలుపుకుని తెరకెక్కాయి. సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా బహుబలి తర్వాత మేకర్స్ లో ఈ ఉత్సాహం ఎక్కువైంది. ఆ క్రమంలో మళయాళంలో వచ్చిన చరిత్రను బేస్ చేసుకుని వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా కేరళలలో ఆల్రెడీ రిలీజైంది. అక్కడ మోహన్ లాల్ ఉండటం, వాళ్ల కథ కావటంతో  మంచి క్రేజే క్రియేట్ అయ్యింది. తెలుగులో అఖండ వేడిలో ఈ సినిమాని పట్టించుకునే వారు పెద్దగా కనపడటం లేదు. ఈ క్రమంలో పెద్దగా బజ్ లేకుండా రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది, కథేంటి, మనవాళ్లకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూ(Marakkar Movie Review)లో చూద్దాం.

కథ

ఈ కథ మహ్మద్‌ అలీ మరక్కర్‌ అలియాస్‌ కుంజాలి మరక్కర్‌  చుట్టు తిరుగుతుంది. ఆయన 16 వ శతాబ్దంలో నావెల్‌ చీఫ్‌. మరక్కార్ మామూలోడు కాదు. యుద్దం అంటే ఓ కళ అన్నట్లుగా కదన రంగంలో చెలరేగిపోతూంటాడు. అప్పుడే కేరళలోని కొచ్చిన్ పై పోర్చుగీస్ వారి దాడికి ఎదురునిలిచాడు.   అప్పుడు పోర్చుగీస్ నాయకుడు వాస్కోడిగామా ఆయన కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేస్తారు. ఆ తర్వాత మరక్కార్ ఏమయ్యారో ఎవరికీ అర్దంకాదు. అయితే మరక్కార్..పరారీలో ఉండి పోర్చుగీస్ పై పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. అంతేకాదు అడవుల్లో ఉంటూ రాబిన్ హుడ్ లా మారతాడు. పెద్దవాళ్లను కొట్టి పేదవాళ్లకు పెడతాడు.  మరో ప్రక్క కొచ్చిన్ ని ఆక్రమించాలని పోర్చుగీస్ వారు స్కెచ్ వేస్తారు. సముద్రంలో వాళ్లను అడ్డుకోవటానికి మరక్కర్ నేవీ చీఫ్ గా మళ్లీ సీన్ లోకి వస్తాడు. అప్పుడేం జరిగింది..మరక్కర్ పగ తీర్చుకోగలిగాడా...పోరాటంలో అంతిమ గెలుపు ఎవరిది, ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
ఎనాలసిస్..

ఈ చిత్రం విడుదలకు ముందే 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఈచిత్రం ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఇలాంటి సినిమా ఏ స్దాయిలో ఉంటుందని ఎక్సెపెక్ట్ చేస్తాం. కానీ ఆ అంచనాలు అన్ని కళ్ల ముందే కరిగిపోతాయి. అలాగని సినిమాలో ఆకట్టుకునే ఎలిమెంట్స్ లేవని కాదు. దర్శకుడు  ప్రియదర్శన్ తన విజన్ తో భారీ కాన్వాస్ నే ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. అయితే కథ లో రీసెర్చ్ అనేది కనపడదు. అలా నడుచుకుంటూ ఏదో జానపద కథను చూస్తున్నట్లు అనిపిస్తుంది. పోనీ అదైనా కరెక్ట్ గా ముందుకు వెళ్తుందా అంటే చరిత్రను ముందుకు తీసుకొస్తుంది.  16 శతాబ్దం ఎక్కడా మనకు కనపడదు.  ఆ టైమ్ లైన్ ఎక్కడా ఫాలోకాలేదు. క్యారక్టర్స్ స్టడీగా ఉండవు..కామికల్ గా మారిపోతూంటాయి. 
 
స్క్రీన్ ప్లే విషయానికి వస్తే...ట్విస్ట్ లు టర్న్ లు చెప్పుకోదగనివిగా ఉండవు. చాలా ప్రెడిక్టబుల్ గా నడుస్తూంటాయి. ఏ దశలోనూ కథ,కథనం రక్తి కట్టదు. వాస్తవానికి ఎత్తుకున్న ప్లాట్ లో మంచి విషయం ఉన్నా..దాన్ని లైట్ తీసుకున్నారు. సముద్ర నేపధ్యం ఉన్నా కథకు డెప్త్ రాలేదు. ఎంతసేపూ విజువల్ ఎఫెక్ట్ లు, ఫైట్స్, కాస్టూమ్స్ ఇవే హైలెట్ అవుతూంటాయి. ఎమోషన్స్  అయితే అసలు పండలేదు. అర్జున్  , సునీల్‌శెట్టి వంటి ఆర్టిస్ట్ లు ఉన్నా వాళ్లను సరిగ్గా వాడుకోలేదు. ఇక స్త్రీ పాత్రలు అయితే మరీ దారుణం. అసలు వాటిని పట్టించుకోలేదు. మళయాళ లేడీ సూపర్ స్టార్ మంజువారియర్ పాత్ర అయితే అసలు నటించటానికి స్కోపే లేదు. కీర్తి సురేష్ ఈ కథలో కొంచెం కూడా ప్లేస్ దక్కించుకోలేకపోయింది. అలా దర్శకుడు ప్రియదర్శన్ అన్ని రకాలుగా సినిమాని నీరసపరిచే పోగ్రాం పెట్టుకున్నాడనిపించింది.

నటీనటులు...

మోహ‌న్‌లాల్  ప్రధాన పాత్ర పోషించినా ..ఆయనలో ఆ జోష్ లేదు. క్యారక్టర్ ఆయన్ని తినేసింది.  ఆయన ఎక్సపీరియన్స్ కూడా ఈ క్యారక్టర్ ని లేపటానికి పనికిరాలేదు. ఇక మోహన్ లాల్ కుమారుడు  ప్ర‌ణ‌వ్‌, అతను ప్రియురాలి గా చేసిన ప్రియ‌ద‌ర్శిని జోడీ ఆక‌ట్టుకుంటుంది.  సుహాసిని పాత్రను మొదట్లోనే చంపేసారు.

సాంకేతికంగా

ఈ సినిమాని టెక్నికల్ గా అప్జేట్ గా తీసారు ప్రియదర్శన్.  విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ బాగున్నాయి, సాబు సిరిల్ ఈ సినిమాకు మరో ఎస్సెట్. సంగీతం ఓకే, తిరు కెమెరా ప‌నిత‌నం అద్బుతం కాదు కానీ నడిచిపోయింది. రైటింగే సినిమాని బాగా దెబ్బకొట్టింది.  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  దర్శకుడుగా  ప్రియ‌ద‌ర్శ‌న్ ని ఆయన రాసుకున్న కథే ఫెయిల్ చేసింది.  

బాగున్నవి

సినిమాకు ఎంచుకున్న కథ
మోహన్ లాల్

బాగోలేనివి

ఎమోషన్ లేని ఎలివేషన్స్
స్క్రీన్ ప్లే

ఫైనల్ థాట్

ఈ సినిమాని తీయటమే కాదు చూడటమూ కష్టమే 

Rating:2


ఎవరెవరు..
న‌టీన‌టులు: మోహ‌న్‌లాల్‌, సుహాసిని, ప్ర‌ణ‌వ్ మోహ‌న్‌లాల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, కీర్తిసురేష్‌, అర్జున్ స‌ర్జా, సునీల్‌శెట్టి, మంజు వారియ‌ర్‌, నెడుముడి వేణు త‌దిత‌రులు; స్క్రీన్‌ప్లే: ప్రియ‌ద‌ర్శ‌న్, అని శ‌శి,
 సంగీతం: రోనీ రాఫెల్‌;
 నేప‌థ్య సంగీతం: రాహుల్ రాజ్‌, అంకిత్ సూరి, లైల్ ఎవ్‌నాస్ రోడ‌ర్‌; 
ఛాయాగ్ర‌హ‌ణం: తిరునావుక్క‌ర‌సు; 
కూర్పు: అయ్య‌ప్ప‌న్ నాయ‌ర్‌; 
నిర్మాణం: ఆంటోనీ పెరంబ‌వూర్‌;
 ద‌ర్శ‌క‌త్వం: ప్రియ‌ద‌ర్శ‌న్‌;
 విడుద‌ల‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌; 
విడుద‌ల తేదీ: 3-12-2021

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios