Asianet News TeluguAsianet News Telugu

‘మధుర వైన్స్’ సినిమా రివ్యూ

సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్‌ ప్రధాన పాత్రధారులుగా జయకిశోర్‌ బండి దర్శకత్వంలో రాజేష్, సృజన్‌ నిర్మించిన చిత్రం ‘మధుర వైన్స్‌’. ఈ సినిమా అక్టోబరు 22న విడుదల అయ్యింది.

Madhura Wines Telugu Movie Review
Author
Hyderabad, First Published Oct 23, 2021, 10:43 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 షార్ట్ ఫిలిమ్స్‌తో పేరు తెచ్చుకుని సినిమాలు పట్టుకున్న డైరక్టర్స్ లిస్ట్ లో మరొకరు చేరారు. ’15 డేస్ ఆఫ్ లవ్’ అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో రికార్డ్ స్దాయి వ్యూస్ సంపాదించింది. అంతేకాదు ఆ డైరక్టర్ జయకిశోర్ బి ని...సినీ డైరెక్టర్ చేసింది. దాంతో విభిన్నంగా ఉంటుందని వైన్ షాప్ నేపథ్యంలో ‘మధుర వైన్స్’(Madhura Wines) అనే సినిమా తీసారు. ఆయన షార్ట్ ఫిల్మ్ చూసి ఇష్టపడ్డ ఓ వర్గం ఈ సినిమా చూసేందుకు ఉత్సాహం చూపించారు. సినిమా కాబట్టి మరింత క్రియేటివిటితో తెరపై అద్బుతాన్ని ఆవిష్కరించారా..లేక తెరపైనా షార్ట్ ఫిల్మ్ నే ప్రెజెంట్ చేసారా..అసలు ఈ సినమా కథేంటి, ఈ డిఫరెంట్ టైటిల్ ఏమిటి వంటి విషయాలు Madhura Wines Reviewలో చూద్దాం. 

కథ

తన లవర్ బ్రేకప్ చెప్పి వేరే వాడితో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవటంతో వైన్ తాగి తనను తాను ఓదార్చుకుందామనుకుంటాడు అజయ్(సన్నీ నవీన్). ఆ మత్తులో ఆమెను మర్చిపోయే ప్రయత్నం చేస్తూంటాడు.  అతను రెగ్యులర్ గా వెళ్లే వైన్ షాప్ మధుర వైన్స్. అక్కడే అతనికి  అంజలి(సీమా చౌదరి) పరిచయం అవుతుంది. అతని గతం తెలుసుకుని మరీ జాలిపడి, నిజాయితి కనిపించిందని ప్రేమలో పడుతుంది.  అయితే ఇది మధుర వైన్స్ ఓనర్ ఆనంద్ రావు (సమ్మోహిత్ ములూరి)కు ఇష్టం ఇష్టం ఉండదు. తాగి తన జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తితో ఆమె కు పెళ్లేంటి అంటాడు. నో చెప్పేస్తాడు. ఇంతకీ ఆనందరావుకు, అంజలికు ఉన్న రిలేషన్ ఏమిటి...అజయ్ తన ప్రేమను చివరకు ఎలా గెలిపించుకున్నాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
  
ఎనాలసిస్ ...

 ఇక షార్ట్ ఫిల్మ్ లతో పరిచయం అయ్యి పెద్ద డైరక్టర్స్ అయ్యిన వారు ఉన్నారు. అలాగే సినిమా కూడా షార్ట్ ఫిల్మ్ లాంటి కాన్సెప్టు తీసుకుని , అలాగే చేసినవారు ఉన్నారు. ఈ దర్శకుడు కూడా చాలా థిన్ లైన్ తీసుకుని రెండు గంటల కథ చెప్దామనుకునే ప్రయత్నం చేసారు. అయితే అతనికి ఆ అనుభవం సరిపోలేదేమో అనిపిస్తుంది. ట్రీట్మెంట్ బేసెడ్ గా సాగే ఈ కథలో ఎక్కడా సరైన మలుపులు ఉండవు, ఇంట్రస్టింగ్ నేరేషన్ ఉండదు. ఒకటే కథ ఫస్ట్ నుంచి చివరి దాకా సాగుతుంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పటికీ డైలాగులు బాగానే  రాసుకున్నారు కానీ అవేమీ బలహీనంగా ఉన్న కథ,కథనాలకు కలిసి రాలేదు. దర్శకుడు మేకింగ్ పరంగా కూడా ఎక్కడా సినిమాటెక్ ఎక్సపీరియన్స్ ఇవ్వలేకపోయారు. కథ మొత్తం మూడే క్యారక్టర్స్ చుట్టూ రాసుకుంటే బడ్జెట్ కంట్రోలులో ఉందేమో కానీ సీన్స్ రిపీట్ అవుతున్నట్లు అనిపించాయి. ఎక్కడా కాంప్లిక్ట్ అనేది లేకుండా సీన్స్  చేయటంతో ఏ క్యారక్టర్ సరిగ్గా ఎలివేట్ కాలేదు. టోటల్ మొత్తం ఎఫెర్ట్ బేస్ లెస్ గా అయ్యింది. ప్రేమ విఫలమైందని తాగుడు మొదలెట్టి..అదే తన తర్వాత జీవితంలో ఏర్పడే ప్రేమకు అడ్డుగా  మారిన కుర్రాడి కథే ఇది. స్టోరీ లైన్ గా వినటానికి బాగానే ఉన్న  ఈ కథ , ట్రీట్మెంట్ విషయంలో ఫెయిలైంది. ఎంచుకున్న లైన్ బాగున్నా చెప్పే నేరేషన్ బోర్ కొట్టించింది. కొన్ని కీ సీన్స్ అయితే మరీ సినిమాటెక్ గా,ఫోర్సెడ్ గా ఉన్నాయి. స్క్రిప్టు మీద ఇంకాస్త వర్క్ చేస్తే బెటర్ అవుట్ ఫుట్ వచ్చేదనిపిస్తుంది. ఎందుకంటే కాంప్లిక్ట్స్ పాయింట్ నుంచి కథ  పరుగులు పెడుతుందనుకుంటే ఆ తర్వాత మరీ నీరసపడిపోయింది.  
  
టెక్నికల్ గా
మొదటే అనుకున్నట్లు ఈ సినిమాలో కాస్త బాగున్నాయి అనిపించినవి డైలాగ్స్. కానీ సీన్స్ సహకరించకపోవటంతో అవీ వృధా అయ్యాయి. ఫస్టాఫ్ బాగానే వెళ్లిపోయినా,సెకండాఫ్ ఎమోషనల్ గా తీసుకెళ్దామనుకుని డల్ చేసేసారు. సీన్ లో అంత సీన్ లేకపోయినా చెప్పే డైలాగ్స్ విసుగెత్తించాయి.  కార్తిక్, జయ్ క్రిష్ ల పాటలు ఎలా ఉన్నా రీరికార్డింగ్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకో పావుగంట ట్రిమ్ చేయచ్చేమో అనిపించింది. కాకపోతే అలా చేస్తే మరీ షార్ట్ ఫిల్మ్ అయిపోతుందనుకుని ఉండచ్చు.  సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్  బాగున్నాయి. 

ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్  విషయానికి వస్తే.. అజయ్ పాత్రని సన్నీ నవీన్ పెద్ద తెరకు కొత్తవాడైనా మంచి ఈజ్ తో పోషించాడు. గతంలో షార్ట్ ఫిల్మ్ లు చేసిన అనుభవం పనికొచ్చింది. డాన్స్ లు, యాక్షన్ బ్లాక్స్ కూడా బాగా చేసారు. మద్యానికి బానిసైపోయిన కుర్రాడిగా మంచి ఎక్సప్రెషన్స్ ఇచ్చాడు. ఎంకరేజ్ చేస్తే మంచి ఆర్టిస్ట్ దొరికినట్లే.  హీరోయిన్ గా సీమా చౌదరి లుక్స్ పరంగా  బాగుంది కానీ నటనలో పరిణితి లేదు. సమ్మోహిత్ తుమ్మలూరి నేచురల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు . 
 
ఫైనల్ థాట్
టైటిల్ లో 'వైన్' ఉంది కదా అని టెమ్ట్ అయితే ఆ తర్వాత నిజంగానే 'వైన్ షాప్' కు వెళ్లాల్సి ఉంటుంది
 Rating: 2
 
ఎవరెవరు..
బ్యానర్: ఆర్ కే సినీ టాకీస్ 
 నటీనటులు: సన్నీ నవీన్, సీమా చౌదరీ, సమ్మోహిత్ తూములూరి తదితరులు 
సినిమాటోగ్రాఫర్: మోహన్ చారి 
సంగీతం: కార్తీక్ రోగ్రిగ్జ్, జయ్ క్రిష్ 
ఎడిటర్: వర ప్రసాద్ 
కథ, దర్శకత్వం: జయకిషోర్ బీ 
నిర్మాతలు: రాజేశ్ కొండెపు, సృజన్ యరబోలు
 సహ నిర్మాత: సాయి శ్రీకాంత్ తెరువు 
రన్ టైమ్: 2 గంటల 3  నిముషాలు
రిలీజ్ డేట్: 2021-10-22
  

Follow Us:
Download App:
  • android
  • ios