నడిరోడ్డు మీద రేప్ చేస్తా: సినీ నటి కంగనాకు బెదిరింపు

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కి బెదిరింపులు వచ్చాయి. రేపు చేస్తానంటూ ఓ వ్యక్తి బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. అయితే ఆయన బాధ్యతగల న్యాయవాది కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది.

a lawyer has threatened to rape kangana ranaut arj

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కి బెదిరింపులు వచ్చాయి. రేపు చేస్తామంటూ ఓ వ్యక్తి నుంచి బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. అయితే ఆయన బాధ్యతగల న్యాయవాది కావడం గమనార్హం. అయితే అనంతరం ఓ ట్వీస్ట్ ఇచ్చాడు ఆ న్యాయవాది. ఇంతకి అసలు విషయానికి వస్తే.. 

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో కంగనా బాగా స్పందించారు. నెపోటిజం, డ్రగ్స్ వ్యవహారాలపై ఆమె అనేక విమర్శలు చేశారు. ఈ క్రమంలో ముంబయి పోలీసులకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి, కంగనాకి మధ్య ఓ యుద్ధమే సాగింది. దీంతో ఆమెపై విమర్శలు, దాడులు జరుగుతున్నాయి. అనేక దెబ్బలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ మధ్య వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తుమకూరు కోర్ట్ ఆదేశాల మేరకు క్యతాసంద్ర పోలీస్‌ స్టేషన్‌లో కంగనాపై కేసు నమోదైంది. ఇటీవల బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశంతో ముంబై పోలీసులు కంగనాపై దేశ ద్రోహం కేసు కింద మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.  

వీటిపై స్పందించిన కంగనా సెటైరికల్‌ కామెంట్‌ చేశారు. `నవరాత్రి వేళ ఎవరు ఉపవాసం ఉన్నారు? ఈ రోజు వేడుకల నుంచి ఫోటోలు ఇవి. ఇక నాపై మరొక కేసు నమోదైంది. మహారాష్ట్రలోని పప్పు సేన నాపై మక్కువ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. నన్ను మిస్‌ కావద్దు. త్వరలోనే అక్కడకు వస్తా` అని ట్వీట్‌ చేసింది. వీటిని పరిగణలోకి తీసుకుని తాజాగా కంగనా రనౌత్‌కు ఒడిశాకు చెందిన న్యాయవాది నుంచి అత్యాచారం బెదిరింపు వచ్చింది. `నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా` అని ఆ పోస్ట్ లో ఉంది.

ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలిలో తమ సోదరి పెళ్ళి వేడుకలో ఉన్న కంగనా ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. అయితే తన ఖాతా హ్యాక్ చేశారని సదరు న్యాయవాది అనంతరం ఓ పోస్ట్ చేశాడు. `ఈ రోజు నా ఫేస్‌బుక్‌ హ్యాక్‌ అయ్యింది. అందులో అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్ట్ ఉంది. మహిళలను, సమాజాన్ని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు నావి కావు. నా ఫ్రెండ్స్ ద్వారా ఈ విషయం తెలుసుకుని నేను కూడా షాక్‌ కి గురయ్యాను. వీటి వల్ల ఎ వరి మనోభావాలు అయిన దెబ్బతింటే నన్ను కక్షమించండి` అని తెలిపారు. అనంతరం ఆ పోస్ట్ ని డిలీట్‌ చేశారు. మరి దీనిపై కంగనా, ఆమె సోదరి రంగోలి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios