12th Fail Movie Review: `12th ఫెయిల్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

మనోజ్‌ కుమార్‌ శర్మ అనే రియల్‌ లైఫ్‌ ఐపీఎస్‌ అధికారి జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం `12th fail`. హిందీలో గత వారం విడుదలై ఆదరణ పొందిన ఈ చిత్రం నేడు(శుక్రవారం) తెలుగులో విడుదలైంది. ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

12th fail movie review and rating arj

ఇతర భాషల్లో హిట్‌ అయిన చిత్రాలు వారం తర్వాత డబ్‌ అయి రిలీజ్‌ అవుతూ మంచి ఆదరణ పొందుతున్నాయి. కన్నడ `కాంతార`, మలయాళ `2018` చిత్రాలు ఇలాంటి విజయాలనే అందుకున్నాయి. అలానే ఇప్పుడు మరో సినిమా వచ్చింది. హిందీలో మంచి ఆదరణ పొందిన `ట్వెల్త్ ఫెయిల్‌` (12th Fail) మూవీ తెలుగులో రిలీజ్‌ అయ్యింది. ప్రముఖ దర్శక, నిర్మాత విధూ వినోద్‌ చోప్రా దర్శకత్వం వహించారు. యోగేష్‌ ఈశ్వర్‌తో కలిసి వినోద్‌ చోప్రా నిర్మించారు. విక్రాంత్‌ మెస్సీ హీరోగా నటించగా, మేథా శంకర్‌ హీరోయిన్‌గా, ఆనంద్‌ వీ జోషి, ప్రియాంశు చట్టర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం హిందీలో గత వారం విడుదలై విమర్శలకు ప్రశంసలందుకుంది. ఈ శుక్రవారం (నవంబర్‌ 3న) తెలుగులో విడుదలైంది. మరి సినిమా తెలుగు ఆడియెన్స్ ని మెప్పించేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథః
బందిపోట్లకి నిలయం అయిన చంబల్‌ ప్రాంతంలోని చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్‌ కుమార్‌ శర్మ(విక్రాంత్‌ మెస్సీ) ఇంటర్‌ చదువుతుంటాడు. నాన్న సిన్సీయర్ ప్రభుత్వ ఉద్యోగి. ఆ సిన్నియారిటీ వల్ల ఉద్యోగం పోతుంది. అవినీతి, లంచగొడ్డితనంపై పోరాడాలని పట్నం వెళ్తాడు. మరోవైపు మనోజ్‌ కుమార్‌ శర్మ భవిష్యత్‌లో పెద్ద ఉద్యోగం సాధించాలని కలలు కంటూ చిట్టీలు రాసుకుంటుంటాడు. వారి ప్రాంతంలో ఎమ్మెల్యే స్కూల్‌లో మొత్తం చిట్టీలు కొట్టి పాస్‌ అవుతుంటాడు. జనం చదువు రాక గొర్రేల్లా ఉండాలనేది ఆయన ప్లాన్‌. అయితే ఆ ఏడాది ఒక స్టిక్ట్ పోలీస్‌ ఆఫీసర్‌ వచ్చి ఆ కాపీ కొట్టడాన్ని అరికట్టారు. దీంతో అంతా ఫెయిల్‌ అవుతారు. ఆ తర్వాత ఓ రోజు మనోజ్‌, ఆయన అన్నని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ సమయంలో సిన్నియర్ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన డీఎస్పీ వీరి నిజాయితీని చూసి స్టేషన్‌ నుంచి విడిపిస్తాడు. దీంతో ఆ డీస్పీని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకుంటాడు మనోజ్‌. ఆయనలా డీఎస్పీ కావాలనుకుంటాడు. నెక్ట్స్ ఇయర్‌ చిట్టీలు కొట్టకుండా కష్టపడి చదివి థర్డ్ గ్రేడ్‌లో పాస్‌ అవుతాడు. ఆ తర్వాత నాన్నమ్మ ఇచ్చిన పెన్షన్‌ డబ్బులు తీసుకుని డీఎస్పీ కావాలని కోచింగ్‌ సెంటర్ల కోసం 12th Fail) పట్నం వెళ్తాడు మనోజ్‌. కానీ బస్‌లో తన సూట్‌కేస్‌ని కొట్టేస్తారు. డబ్బులన్నీ పోతాయి. రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి. దీనికితోడు మూడేళ్లదాక నోటీఫికేషన్‌ లేదని ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇంటికి తిరిగి వెళ్లలేడు,ఇంటికొస్తే పోలీస్‌ బట్టలతోనే వస్తానని ఇంట్లో మాటిచ్చాడు. దీంతో అక్కడే ఓ హోటల్‌ వద్ద మూడు రోజులు పస్తులుంటాడు. ఆ సమయంలో సివిల్స్ ప్రిపరేషన్‌ కోసం ఢిల్లీ వెళ్తున్న ప్రీతమ్‌ పాండే(ఆనంత్‌ వీ జోషి) పరిచయం అవుతాడు. ఆయన సపోర్ట్ తో ఢిల్లీ వెళ్లి సివిల్స్ (యుపిఎస్‌సీ) ప్రిపరేషన్‌ స్టార్ట్ చేస్తాడు. అక్కడ గౌరీ అన్న(ఆయుష్మాన్‌ పుస్కర్‌) సహకారంతో రెండో అటెంప్ట్ లో ప్రిలిమ్స్ పాస్‌ అవుతాడు. కానీ వరుసగా మూడు సార్లు మెయిన్స్ లో పోతాడు. చదువుకోవడానికి డబ్బుల్లేవు, పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితి, మరోవైపు హీరోయిన్‌ హ్యాండిస్తుంది. మరి వీటిని ఎలా ఫేస్‌ చేశాడు? ఎలా చదివాడు? ఎంతటి దుర్భరపరిస్థితులు ఎదుర్కొన్నాడు? చివరికి తాను అనుకున్న ఐపీఎస్‌ అయ్యాడు? తాను ఐపీఎస్‌ అవ్వాలనుకునే లక్ష్యానికి కారణం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. 

విశ్లేషణః 
ఇది రియల్‌ లైఫ్‌ స్టోరీ. రియల్‌ లైఫ్‌లో ఇలా  ఆర్థికంగా ఇబ్బంది పడి, చదువుకోలేని స్థితితో, చెంబల్‌ వంటి బందిపోట్ల ప్రాంతం నుంచి వచ్చి ఐపీఎస్‌ అయిన మనోజ్‌ కుమార్‌ శర్మ జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు విధూ వినోద్‌ చోప్రా. ఎడ్యూకేషన్‌ పరంగా ఇదొక మంచి ఇన్‌స్పైరింగ్‌ మూవీ అని చెప్పొచ్చు. పేద విద్యార్థుల బాధలను, కష్టాలను ఆవిష్కరించే చిత్రంగా నిలుస్తుంది. ఎడ్యూకేషన్‌ బేస్డ్ రియల్‌ లైఫ్‌ స్టోరీస్‌ వెండితెరపై రావడం చాలా అరుదు. కానీ సరైన ఎమోషన్స్ తో, డ్రామా మేళవింపుతో చేస్తే సక్సెస్‌ అవుతుందని నిరూపించే సినిమాగా ట్వెల్త్ ఫెయిల్‌(12th Fail) మూవీ నిలుస్తుంది. ఈ సినిమాని అంతే రియాలిటీగా, ఆద్యంతం భావోద్వేగభరితంగా తెరకెక్కించారు దర్శకుడు వినోద్‌ చోప్రా. స్టూడెండ్స్ కి, ఎడ్యూకేషన్‌ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యేవారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. వారిని ఇన్‌స్పైర్‌ చేస్తుంది. 

సినిమా ప్రారంభం మనోజ్‌ కుమార్‌ శర్మ ఫ్యామిలీ పరిస్థితిని ఆవిష్కరించి కథపై ఎస్టాబ్లిష్‌ చేశాడు. అదే సమయంలో హీరో ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాడనేది క్లారిటీగా చూపించారు. హీరోకి ఊర్లో ఎదురైన పరిస్థితులు, అక్కడ అవినీతికి, లంచగొడ్డి తనానికి వ్యతిరేకంగా వెళ్లితే ఏం జరుగుతుందో చూపించారు. అంతేకాదు బందిపోట్ల నిలయం అయిన ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే అరాచకాలను, ఎడ్యూకేషన్‌ సిస్టమ్‌ని కళ్లకి కట్టినట్టు చూపించారు. అయితే అదేదో సీరియస్‌గా కాకుండా చాలా సెటైరికల్‌గా చెప్పే 12th Fail) ప్రయత్నం బాగుంది. సినిమా సీరియల్‌ మూడ్‌లో సాగుతూనే అందులోనే చిన్న చిన్న ఫన్‌ని ఎలివేట్‌ చేసిన తీరు, మరోవైపు హీరోలోని ఇన్నోసెన్స్ నుంచి కామెడీని రాబట్టిన తీరు చాలా బాగుంది. ఇక పట్నంలో డబ్బుల పోయాక తిండిలేక ఆకలితో అల్లాడిపోతూ, చివరికి హోటల్‌ యాజమానిని అన్నం కోసం అడిగిన తీరు, మనసుని కదిలిస్తుంది. మరోవైపు ఢిల్లీ వెళ్లాక పోటీ పరీక్షల కోసం విద్యార్థుల హడావుడి, వారి బాధలు, వాస్తవంగా ఏం జరుగుతుంది, ఎంత మంది ఇలా పేద విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లో చదువుకుంటారు అనే విషయాలను ఆవిష్కరించిన తీరు బాగుంది. అవన్నీ మనసుని ఆకట్టుకునేలా ఉంటాయి. వాస్తవ పరిస్థితుల నుంచి ఫన్‌ని, సీరియస్‌నెస్‌ని, మేళవిస్తూ ఎమోషనల్‌గా చూపించిన తీరు ఆకట్టుకుంది. 

ఇక మనోజ్‌ కుమార్‌ డబ్బుల్లేక బాత్‌రూమ్‌లు కడగడం, లైబ్రరీలోవర్క్ చేయడం, చివరికి చిన్న పిండిమర ఇంట్లో రోజూ 15 గంటలు పనిచేస్తూ, ఆరు గంటలు చదువుతూ, మూడు గంటలు నిద్రపోవడం వంటి సీన్లు హృదయాలను కదిలించేలా ఉంటుంది. అదే సమయంలో స్టూడెండ్స్ కి, ప్రేపర్‌ అయ్యేవారికి బాగా కనెక్ట్ అవుతుంది. ఎంతో మంది నిజ జీవితాలకు ఈ సన్నివేశాలు అద్దం పడతాయి. క్లైమాక్స్ లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు, రిజల్ట్ చూసుకున్నాక వారిలోని ఆనందం, ఎమోషన్స్ ని కాప్చర్‌ చేసిన తీరు, దాన్ని ఆవిష్కరించిన తీరు అద్భుతం. థియేటర్లో కూర్చొన్న ఆడియెన్స్ తానే ఉద్యోగం సాధించినంతగా ఫీలవుతారని చెప్పొచ్చు. అయితే సినిమా కొంత స్లోగా సాగుతుంది. తెలిసిన ఆర్టిస్టులు లేకపోవడంతో వాళ్లు మనకు కనెక్ట్ కావడానికి కొంత టైమ్‌ పడుతుంది. అదే సమయంలో డబ్బింగ్‌ కూడా చాలా చోట్ల కన్విన్సింగ్‌గా అనిపించదు. చాలా సీన్లు సాగదీసినట్టుగా ఉంటాయి. రిపీటెడ్‌ సీన్లు కూడా కొంత బోర్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. కానీ ఆర్‌ఆర్‌ దాన్ని కవర్‌ చేస్తుంది. అయితే సివిల్స్ ప్రిపరేషన్స్ లో ఏం జరుగుతుంది, ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయనేది కూడా డిటెయిలింగ్ గా చూపించడం బాగుంది. మొత్తానికి ఇదొక ఎమోషనల్‌, ఇన్‌స్పైరింగ్‌ జర్నీ అని చెప్పొచ్చు. 

ఆర్టిస్టులుః

మనోజ్‌ కుమార్‌ శర్మ పాత్రలో విక్రాంత్‌ మెస్సీ అద్భుతంగా చేశాడు. పాత్రలో జీవించాడు. నటిస్తున్నట్టుగా కాకుండా తనదే లైఫ్‌ అనేలా చేశాడు. బాధని లోపల దాచుకుని, పైకి నవ్వే సీన్లలో ఆయన ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. సినిమాని సింపుల్‌గా తన భుజాలపై మోశాడు. నవ్వించాడు, హృదయాన్ని 12th Fail)  కదిలించాడు, కన్నీళ్లు పెట్టించాడు. ఇక లవర్‌ శ్రద్ధా పాత్రలో మేథా శంకర్‌ ఉన్నంతలో బాగా చేసింది. మరోవైపు ఫ్రెండ్‌ పాండే గా ఆనంత్‌ వీ జోషి నటన చాలా బాగుంది. అలరించేలా ఉంటుంది. గౌరీ పాత్రలో ఆయుష్మాన్‌ పుస్కర్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌గా అనిపిస్తుంది. మరోవైపు డీఎస్పీగా ప్రియాన్షు చట్టర్జీ కొన్ని సీన్లే అయినా సెటిల్డ్ గా చేసి అదరగొట్టాడు. మనోజ్‌ తండ్రిగా హరీష్‌ ఖన్నా, తల్లిగా గీతా అగర్వాల్‌ పాత్ర పరిధి మేరక మెప్పించారు.

టెక్నీకల్‌గాః 
సినిమాలో రంగరాజన్‌ రామబద్రం కెమెరా వర్క్ బాగుంది. చాలా సహజంగా కనిపించింది. వాస్తవాన్ని ఆవిష్కరించేలా విజువల్స్ ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌ నీట్‌గా ఉంది. ఎడిటింగ్‌ పరంగా కొంత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. మ్యూజిక్‌ సినిమాకి హైలైట్‌. బ్యాక్‌ బోన్‌. శాంతను మోయిత్రా అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు. కథలో వచ్చే పాటలు, ఎమోషన్స్ సీన్లు ఆర్‌ఆర్‌ అదరగొడుతుంది. గుండెల్ని పిండేసేలా ఉంటుంది. మనోజ్‌ జీవితంలోకి మనల్ని తీసుకెళ్తుంది. దర్శకుడు విధూ వినోద్‌ చోప్రా 12th Fail) దర్శకత్వం హైలైట్‌ అని చెప్పొచ్చు. ఆయన ఎక్కడా డీవియేట్‌ కాకుండా కథని చాలా నీట్‌గా చెప్పిన తీరు బాగుంది. అలా గలగల సాగిపోతుంటుంది. స్లో నెరేషన్‌, కొన్ని రిపీటెడ్‌ సీన్లు మినహాయిస్తే చాలా ఎంగేజ్‌ చేసేలా చేశాడు. అయితే ఓ విద్యార్థి కష్టాలను ఆవిష్కరిస్తూనే మధ్య మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించిన తీరు బాగుంది. కాకపోతే వాటికంటే ఆయన ప్రిపేర్‌ అయ్యే విద్యార్థుల వాస్తవ పరిస్థితులను, సివిల్స్ ప్రిపరేసన్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఏం జరుగుతుందనేది కళ్లకి కట్టినట్టు చూపించడం బాగుండి. డిటెయిలింగ్‌కి ప్రయారిటీ ఇవ్వడం చాలా మందిని నాలెడ్జ్ ని పంచుతుంది. 

ఫైనల్‌గాః రియల్లీ ఇన్‌స్పైరింగ్‌ జర్నీ. స్టూడెండ్స్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అయ్యే వారికి బాగా కనెక్ట్ అయ్యే మూవీ.

రేటింగ్‌ః 3

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios